Share News

Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్

ABN , Publish Date - Aug 24 , 2024 | 05:44 PM

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, బుల్డోజర్ చర్యలతో పౌరుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.

Mallikarjun Kharge: మైనారిటీలు లక్ష్యంగానే బుల్డోజర్ యాక్షన్.. బీజేపీపై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తప్పుపట్టారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, బుల్డోజర్ చర్యలతో పౌరుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.

Kolkata Doctor Case: నాకు ఏ పాపం తెలియదు.. కోర్టులో సంజయ్ రాయ్ కంటతడి


''ఒక వ్యక్తి ఇంటిని కూల్చేయడం, అతని కుటుంబానికి నిలువ నీడ లేకుండా చేయడం రెండూ కూడా అమానవీయం, అన్యాయం. బీజేపీ పాలిత రాష్ట్రాలు పదేపదే మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 'రూల్ ఆఫ్ లా' ప్రకారం పాలన సాగే సమాజంలో ఇలాంటి చర్యలకు తావులేదు'' అని ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. సహజన్యాయం స్థానంలో అరాచకం చోటుచేసుకోరాదని, నేరాలను పరిష్కరించాల్సింది కోర్టులే కానీ, రాష్ట్ర ప్రభుత్వాల బలప్రయోగాలు కాదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయకపోవడం, బుల్డోజర్ చర్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కాంగ్రెస్ నేత హాజి షెహజాద్ అలీ బంగ్లాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్‌తో కూల్చివేసిన నేపథ్యంలో ఖర్గే తాజా వ్యాఖ్యలు చేశారు. భోపాల్‌లో ఇటీవల పోలీసు అధికారులపై రాళ్లు రువ్విన ఘటనలో హాజీ షెహజాద్ అలీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 05:44 PM