ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National: బెంగాల్ బీజేపీలో చీలిక వచ్చిందా.. సువేందు వ్యాఖ్యలతో తీవ్ర దుమారం..!

ABN, Publish Date - Jul 19 , 2024 | 10:06 AM

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంతో.. ఆ రాష్ట్రంలో ప్రముఖ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం, డీప్యూటీ సీఎం మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Suvendu Adhikari

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంతో.. ఆ రాష్ట్రంలో ప్రముఖ నేతల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం, డీప్యూటీ సీఎం మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. యూపీలో వివాదం నడుస్తుండగానే.. బెంగాల్ బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ నినాదాన్ని వదిలిపెట్టి మాతో ఉన్నవారితో మేం అనే కొత్త నినాదాన్ని తీసుకోవాలని సూచించారు. సువేందుకు అధికారి వ్యాఖ్యలు బెంగాల్ బీజేపీలో కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు నేతలు సువేందు వాఖ్యలకు మద్దతుగా నిలవగా.. మరికొందరు మాత్రం సువేందు వ్యాఖ్యలు పార్టీ వైఖరికి విరుద్ధమంటున్నారు. ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమాశాల్లో సువేందు అధికారి మాట్లాడుతూ.. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడానికి ప్రధాన కారణం మైనార్టీ వర్గాల నుంచి మద్దతు లేకపోవడమేనని చెప్పారు. ఈ క్రమంలో సబ్ కా సాత్.. సబ్‌వికాస్ నినాదం అవసరం లేదని.. దానికి బదులు మనతో ఉన్నవారితో మేము అంటతూ కొత్త నివానాన్ని ప్రతిపాదించారు. సువేందు వ్యాఖ్యలను కొందరు బీజేపీ నేతలు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సువేందు వ్యాఖ్యలపై బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ అధికారికంగా స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలు కేవలం సువేందు వ్యక్తిగతమని తెలిపింది.

BJP: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ కీలక సమావేశం.. నిరాశజనక ఫలితాలపై దిద్దుబాటు


సువేందుకు మద్దతుగా..

సువేందు అధికారి వ్యాఖ్యలకు కొందరు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. బీజేపీ బెంగాల్ మాజీ అధ్యక్షుడు తథాగత రాయ్ స్పందిస్తూ సువేందు అధికారి చెప్పింది నిజమేనన్నారు. సువేందు అధికారి పరిపాలనకు సంబంధించిన అంశంలో ఆ నినాదాన్ని వ్యతిరేకించడం లేదని.. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తకెలిపారు. త్రిపుర మాజీ గవర్నర్ రాయ్, మాజీ ఎంపీ అర్జున్ సింగ్ కూడా సువేందుకు మద్దతుగా నిలిచారు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో అన్ని వర్గాలను ఎలా కలుపుకుపోవాలనే విషయంపై సువేందు తన అభిప్రాయాన్ని చెప్పారన్నారు. బెంగాల్ ఓ ప్రధాన సమస్యను ధైర్యంగా లేవనెత్తారని సువేందును ప్రశంసించారు.

BJP: బీజేపీకి నూతన రథ సారథి.. జాతీయ అధ్యక్షుడిగా ఎవరంటే?


బీజేపీ స్పందన..

కొందరు నేతలు సువేందు అధికారికి మద్దతు ఇవ్వడంపై బీజేపీ పశ్చిమబెంగాల్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ స్పందిస్తూ.. పార్టీ అధికారిక వైఖరిలో ఎటువంటి రాజీ ఉండబోదన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ తమ విధానమని.. ఇందులో రాజీ ఉండదన్నారు. మరోవైపు మంజుదార్ వ్యాఖ్యలపై సువేందు అధికారి స్పందిస్తూ.. రాష్ట్ర అధ్యక్షుడు కూడా వ్యక్తిగతంగా తన అభిప్రాయాలకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం


టీఎంసీ నేత సంచలన ప్రకటన..

ఇద్దరు బీజేపీ ఎంపీలు జూలై 21న తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు టీఎంసీ సీనియర్ నేత కునాల్ ఘోష్ ప్రకటించారు. బెంగాల్‌లో బీజేపీ నుంచి ఎన్నికైన 12 మంది ఎంపీల్లో ఇద్దరు తమతో టచ్‌లో ఉన్నారని ఘోష్ పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలు మమ్మల్ని సంప్రదించి టీఎంసీలో చేరేందుకు ఆసక్తి చూపించారన్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలో పని చేసేందుకు జూలై 21న జరిగే కార్యక్రమంలో పార్టీలో చేరవచ్చని ఘోష్ తెలిపారు.


Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 10:06 AM

Advertising
Advertising
<