ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : గొడ్డలి.. కోడికత్తి.. గులకరాయి డ్రామాలు చాలక ఇప్పుడు ఢిల్లీలో ధర్నా డ్రామా

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:44 AM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు.

  • ఓడినా జగన్‌ నియంతృత్వ పోకడలు మానట్లేదు: టీడీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, జూలై 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నాకు పూనుకున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. గొడ్డలి, కోడికత్తి, గులకరాయి డ్రామాలు చాలక ఇప్పుడు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని జగన్‌ ధర్నా డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయినా జగన్‌ తన నియంతృత్వ పోకడలను మానుకోవట్లేదని విమర్శించారు.

సోమవారం, ఇక్కడ మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, నాగరాజు, పుట్టా మహే్‌షకుమార్‌, శ్రీభరత్‌ మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక జగన్‌ ధర్నాలు అంటున్నారని దగ్గుమళ్ల విమర్శించారు. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ఏపీలో జరిగిన విధ్వంసం అంతా ఇంతా కాదన్నారు.

తాను చేసిన అరాచక పాలనను జనం మరిచిపోకముందే ఢిల్లీలో ధర్నా అంటూ జగన్‌ నానాయాగి చేస్తున్నారని ఎంపీ నాగరాజు విమర్శించారు. అప్పులు తెచ్చుకోవడానికి, పైరవీలు చేసుకోవడానికే గతంలో జగన్‌ ఢిల్లీకి వచ్చేవారని ఎంపీ పుట్టా మహేష్‌ విమర్శించారు. గొడ్డలి, కోడికత్తి, గులకరాయి డ్రామాలు చాలక ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 03:44 AM

Advertising
Advertising
<