ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bihar Floor Test: క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి, పాటలు పాడుతూ సరదాగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు

ABN, Publish Date - Feb 11 , 2024 | 02:04 PM

బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది.

పాట్నా: బీహర్‌లో నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మహాగఢ్ బంధన్‌కు వీడ్కోలు పలికి, బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో సోమవారం నాడు నితీశ్ కుమార్ బలం నిరూపించుకోవాల్సి ఉంది. గఢ్ బంధన్ కూటమిలోని పార్టీలు, సభ్యులు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ నివాసంలో శనివారం రాత్రి సమావేశం అయ్యారు.

క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకొని సరదాగా గడిపారు. ఒకరు గిటార్ పట్టుకొని ఉన్నారు. నుస్రత్ ఫతే అలీఖాన్ ‘కాలి కాలి జుల్పోన్ కే’ అనే పాటను సభ్యులు పాడారు. మరొకరు డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘బలపరీక్ష కోసం ఓటింగ్ ఉన్న ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారు. తమ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఐకమత్యంగా ఉన్నారు. సమిష్టిగా ఉండటమే మా బలం. ఆర్జేడీతో జేడీయూ ఎలా పోరాటం చేయగలదు..? బీహార్‌లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ తమదే అని’ ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ స్పష్టంచేశారు. బలపరీక్షకు సభ్యులందరూ హాజరు కావాలని జేడీయూ ఇప్పటికే విప్ జారీచేసింది. బలపరీక్ష సమయంలో అద్భుతం జరగొచ్చని తేజస్వి యాదవ్ అన్నారు. దాంతో అధికార పార్టీ అప్రమత్తం అయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోస ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 02:04 PM

Advertising
Advertising