Nawab Malik: బీజేపీపై నవాబ్ మాలిక్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Nov 01 , 2024 | 07:19 PM
బహిరంగంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్‌కు నవాబ్ మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. జైలు భయంతో తాను అజిత్ పవార్‌తో కలవలేదని, జైలుకు వెళ్లేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
మంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నవాబ్ మాలిక్ (Nawab Malik)కు ప్రచారం చేయరాదని ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న బీజేపీ నిర్ణయం తీసుకోవడంపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయనే ఆరోపణల ఎదుర్కొంటున్న మాలిక్ తరఫున ప్రచారం చేయమంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల తెలిపారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాలిక్ స్పందిస్తూ, ముస్లిం మతానికి చెందిన వ్యక్తిని కావడం వల్ల తనపై ఉగ్రవాదం ఆరోపణలు చేయడం చాలా తేలికని అన్నారు.
Shaina NC : మహిళా అభ్యర్థిపై 'ఇంపోర్టెడ్ మాల్' వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఎంపీ
''ఉగ్రవాదులతో, అజ్ఞాత నేరప్రపంచంతో సంబంధాలున్నాయని నాపై చేస్తు్న్న ఆరోపణలన్నీ నిరాధారం. ముస్లిం నేతను కావడం వల్లే తేల్లిగా టెర్రరిస్టు ముద్ర వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను అడ్డుకునేందుకు కొందరు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేశారు. అయితే నేను మనీ లాండరింగ్ నిందితుడనే కానీ టెర్రరిజం నిందితుడను కాదు'' అని నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు.
అజిత్ పవార్ రుణం తీర్చుకోలేను
బహిరంగంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్‌కు నవాబ్ మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. జైలు భయంతో తాను అజిత్ పవార్‌తో కలవలేదని, జైలుకు వెళ్లేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. ముఖం ముందు ఒకమాట, ముఖం వెనక ఒక మాట చెప్పే అలవాటు తనకులేదని, ప్రజలకు ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉంటామన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. తనపై ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారని అనుకున్నానో వారినే నిలబెట్టారని, ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలోనే వ్యతిరేకతలు ఉంటాయని, అవి ఇప్పుడూ ఉన్నాయన్నారు. ఎలాంటి వ్యతిరేకత ఉన్నా ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని, ప్రజలు తనను గెలిస్తారని నవాబ్ మాలిక్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం
PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
For National News And Telugu News...
Updated Date - Nov 01 , 2024 | 07:19 PM