ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరు? మూడు రోజుల్లో చెప్పండి..

ABN, Publish Date - Feb 03 , 2024 | 06:44 PM

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ టీమ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిబ్బంది వివరాలు వెల్లడించింది.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ క్రైమ్ బ్రాంచ్ టీమ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సిబ్బంది వివరాలు వెల్లడించింది. దాదాపు 5 గంటలపాటు వేచిచూసినా సీఎం రాకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బందికి నోటీసులు అందించడం గమనార్హం. అంతే కాకుండా ఈ నోటీసుపై మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్ ను కోరారు. బీజేపీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో క్రైమ్ బ్రాంచ్ ఈ నోటీసులు పంపించింది. ఆ ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లను కూడా వెల్లడించాలని కోరింది. అయితే.. ఈ నోటీసుపై కేజ్రీవాల్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

బీజేపీపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలన్నింటిని క్రైమ్ బ్రాంచ్‌కు అందజేయాలని దిల్లీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాగా.. క్రైమ్ బ్రాంచ్ అధికారులపై తనకు సానుభూతి ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దిల్లీలో నేరాలను అరికట్టడమే వారి పని కానీ నేరాలను ఆపడానికి బదులు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని పైర్ అయ్యారు. ఈ తరహా అందుకే దిల్లీలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 03 , 2024 | 06:44 PM

Advertising
Advertising