National: భారత వైద్య విద్యార్థులకు ఫిలిప్పీన్స్‌శుభవార్త
ABN, Publish Date - May 25 , 2024 | 03:21 AM
భారతీయ వైద్య విద్యార్ధులకు మేలు కలిగేలా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అక్కడ వైద్య విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులు స్థానికంగానే ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్సులు మంజూరు చేయాలంటూ చట్టాన్ని తీసుకొచ్చింది.
ముంబయి, మే 24: భారతీయ వైద్య విద్యార్ధులకు మేలు కలిగేలా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అక్కడ వైద్య విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులు స్థానికంగానే ప్రాక్టీసు చేసుకునేందుకు లైసెన్సులు మంజూరు చేయాలంటూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది భారత దేశ నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో విద్యార్థులకు ప్రయోజనం కలిగించనుంది. విదేశాల్లో చదువుకొని వచ్చే విద్యార్థులు భారత దేశంలో ప్రాక్టీసింగ్ లైసెన్సు పొందాలంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిర్వహించే స్ర్కీనింగ్ పరీక్షల్లో ఉత్తర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ స్ర్కీనింగ్ పరీక్షకు హాజరు కావాలంటే విద్యను అభ్యసించిన దేశంలోనూ ప్రామాణికమైన ప్రాక్టీసు లైసెన్సు పొందాల్సి ఉంటుంది. 2021లో ఎన్‌ఎంసీ ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా రష్యా, బెలారస్, జార్జియా దేశాలు నిబంధనల్లో మార్పులు చేశాయి. తాజాగా ఫిలిప్పీన్స్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకొంది.
Updated Date - May 25 , 2024 | 03:21 AM