ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Crime News: డ్రెయిన్‍లో తేలియాడుతున్న మృతదేహం.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజం..

ABN, Publish Date - Feb 15 , 2024 | 03:39 PM

పంజాబ్ అమృత్‌సర్‌లోని బాబా బకాలాలోని ధియాన్‌పూర్ రోడ్ డ్రెయిన్‌లో యువకుడి మృతదేహం కలకలం రేపింది. కాలువలో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పంజాబ్ అమృత్‌సర్‌లోని బాబా బకాలాలోని ధియాన్‌పూర్ రోడ్ డ్రెయిన్‌లో యువకుడి మృతదేహం కలకలం రేపింది. కాలువలో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్ కి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. మృతుడిని అనురాగ్ సింగ్ గా గుర్తించారు. విచారణ అనంతరం మృతుడి తండ్రి సకతార్ సింగ్ ఫిర్యాదుతో పోలీసులు హర్మన్‌దీప్ సింగ్, సాహిల్ సింగ్ లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఫిబ్రవరి 11న అనురాగ్ హర్మన్‌దీప్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ముగ్గురూ డ్రగ్స్ సేవించారు. మత్తులో ఇంకా ఇంకా కావాలంటూ అధికంగా అనురాగ్ ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకున్నాడు. అనంతరం మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12 తెల్లవారు జామున 4 గంటలకు అనురాగ్ సింగ్ మృతి చెందాడు.


అనురాగ్ మృతితో ఇద్దరు స్నేహితులు భయపడిపోయారు. పోలీసులు అరెస్టు చేస్తారేమోననే భయంతో మృతదేహాన్ని అక్కడి నుంచి మాయం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. డెడ్ బాడీని సమీపంలోని డ్రెయిన్ లో పడేశారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. అనురాగ్ ఇద్దరు స్నేహితులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 03:39 PM

Advertising
Advertising