ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Formers Protest: ఇదేనా అమృత్ కాలం - వీక్షిత్ భారత్.. కేంద్రం తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు..

ABN, Publish Date - Feb 13 , 2024 | 04:04 PM

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయు ప్రయోగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద దిల్లీకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు

దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయు ప్రయోగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద దిల్లీకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రైతులపై జరిగిన ఈ క్రూరమైన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని వీక్షిత్ భారత్ ఇదే అని ఎద్దేవా చేశారు. రైతుల నిరసనను అణిచివేసేందుకు ప్రయత్నించకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ఖండించారు. "బీజేపీ పాలనలోని అమృతకాల్ లో జరుగుతున్న సంఘటనలు ఇవే అని అన్నారు. “రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ఉపయోగించడం, బారికేడ్లు ఉంచడం వంటివి సరికాదు. రైతుల గొంతు నొక్కేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పంట రేటు, ఎంఎస్‌పి అమలు చేస్తామని మాట ఇచ్చిన కేంద్రం దానిని నిలుపుకోవడంలో విఫలం అయింది" అని మండిపడ్డారు.


"ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌లకు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. స్వామినాథన్ ఫార్ములా అమలు చేయాలన్న రైతులు డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎంఎస్‌పీ అనేది మోదీ సెల్లింగ్ ప్రైస్ కాదు. ఎంఎస్పీ అనేది కనీస మద్దతు ధర అని" కాంగ్రెస్ ముఖ్య నేత జైరాం రమేష్ వివరించారు.

కాగా.. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర సాధించే లక్ష్యంతో మంత్రులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పంజాబ్, హర్యానాకు చెందిన రైతు సంఘాలు దేశ రాజధానిలో నిరసనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల కారణంగా దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 04:04 PM

Advertising
Advertising