ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttar Pradesh: యూపీ మదర్సా చట్టం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన..

ABN, Publish Date - Apr 05 , 2024 | 04:20 PM

యూపీ మదర్సా బోర్డు చట్టం - 2004 ను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించడంతో పాటు సమాధానం ఇవ్వాలని కోరింది.

యూపీ మదర్సా బోర్డు చట్టం - 2004 ను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ( Supreme Court ) మధ్యంతర స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించడంతో పాటు సమాధానం ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. గతంలో యూపీ మదర్సా చట్టం 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని మదర్సా అజీజియా ఇజాజుతుల్ ఉలూమ్ మేనేజర్ అంజుమ్ ఖాద్రీ వ్యతిరేకించారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Congress: ప్రతి మహిళకు ఏడాదికి రూ.లక్ష.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వరాలు..


The Kerala Story: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. ముఖ్యమంత్రి ఆర్డర్స్..

యూపీ మదర్సా చట్టం 2004 రాజ్యాంగ విరుద్ధమని, లౌకికవాద సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మదర్సాలలో చదువుతున్న విద్యార్థుల చదువుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మదర్సాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో సిట్‌ను ఏర్పాటు చేసింది. యూపీలో దాదాపు 25 వేల మదర్సాలు నడుస్తున్నాయి. ఇందులో దాదాపు 16 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు.


యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ - 2004 ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలోని మదర్సాల విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి తయారైంది. ఈ చట్టం ద్వారా బోర్డు నుంచి గుర్తింపు పొందేందుకు మదర్సాలు కొన్ని ప్రమాణాలు కలిగి ఉండాలి. మదర్సాలకు పాఠ్యాంశాలు, బోధనా సామగ్రి, ఉపాధ్యాయుల శిక్షణ కోసం మార్గదర్శకాలను ఇచ్చింది. వీటిలో లక్షలాది మంది పిల్లలు చదువుతున్నారు మరియు వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 04:20 PM

Advertising
Advertising