Supreme Court: కేజ్రీవాల్ బెయిల్‌కు ఇస్తే తప్పుడు సంకేతాలు
ABN, Publish Date - May 10 , 2024 | 04:54 AM
లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వినతిని ఈడీ వ్యతిరేకించింది.
పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ
న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వినతిని ఈడీ వ్యతిరేకించింది. ఎన్నికలలో ప్రచారం చేయడమనేది ప్రాథమిక హక్కు ఏమీ కాదని, చట్టపరమైన, రాజ్యాంగపరమైన హక్కు కూడా కాదని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
చట్టాలు అందరికీ సమానమేనని, ఎన్నికలలో ప్రచారం కోసం ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడికీ బెయిల్ మంజూరు చేయలేదని తెలిపింది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తే జైలులో ఉన్న రాజకీయ నాయకులందరూ ప్రచారం కోసం బెయిల్‌ను హక్కుగా కోరుకుంటారని వాదించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపినట్లవుతుందని తెలిపింది. బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ తన వైఖరిని వివరిస్తూ అఫిడవిట్ సమర్పించింది.
Updated Date - May 10 , 2024 | 04:55 AM