ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hit And Run Case: మేం పేదలం.. మద్దతుగా నిలబడరు

ABN, Publish Date - Jul 09 , 2024 | 08:24 PM

ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు.

BMW Hit And Run

ముంబై: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ (BMW Hit And Run) కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు. ‘నా కళ్ల ముందే భార్యను కారుతో ఢీ కొని లాక్కెళ్లాడు. నా భార్య కావేరి అక్కడిక్కడే చనిపోయింది. మా గోడు వినేవారు ఎవరూ లేరు. ఎందుకంటే మేం పేదలం. మాకు ఎవరూ మద్దతుగా నిలబడరు, న్యాయం చేయరు. కారుతో ఢీ కొన్న వ్యక్తి ఈ రోజు అరెస్టై జైలుకు వెళ్లాడు. రేపు కోర్టులో ప్రవేశ పెడతారు. బెయిల్ కూడా వస్తోంది. బయటకు వస్తారు.. కేసు నీరుగారిపోతుంది. పోరాడేందుకు తన వద్ద డబ్బులు లేవు. అలాంటప్పుడు నేను లాయర్‌ను ఎలా పెట్టుకోగలను. తమకు ఎవరు అండగా ఉండరు. తమను రాజకీయ నేతలు అస్సలు పట్టించుకోరు. రాజకీయ నేత కుమారుడు నిందితుడు. అతని వద్ద డబ్బులు ఉన్నాయి. తమ వద్ద ఏమి లేవు అని’ కంటి నుంచి వస్తోన్న నీటిని ఆపుకొని మృతురాలి భర్త ప్రదీప్ నక్వా నిట్టూర్చారు.


3 రోజుల తర్వాతే ఎందుకు..?

‘రోడ్డు ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత మిహిర్ షా ఎందుకు అరెస్ట్ అయ్యారు. అతడిని ఎందుకు ఇన్నిరోజులు దాచారు..? అతను ఏ తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేదు. మద్యం, డ్రగ్స్ తీసుకోకుంటే ఎందుకు దాగి ఉన్నాడు. ప్రమాదం తర్వాత ఎందుకు పారిపోయాడు. కారు నంబర్ ప్లేట్ ఎందుకు పగలగొట్టారు.. తర్వాత దానిని ఎందుకు దాచారు..? మిహిర్ రక్తంలో ఉన్న ఆల్కహాల్ పోయిన తర్వాత అరెస్ట్ చేయడం ఎందుకు అని’ ప్రదీప్ నక్వానా పోలీసులను ప్రశ్నించారు.


వెనకాల నుంచి ఢీ కొని..

ముంబై వర్లిలో ప్రదీప్ నఖ్వానా తన భార్యతో కలిసి ఆదివారం నాడు చేపలు తీసుకొస్తుండగా వెనకాల నుంచి బీఎండబ్ల్యూ కారు ఢీ కొంది. మిహిర్ షా కారు ఢీ కొనడంతో భార్య భర్తలు పడిపోయారు. కావేరి నక్వాపై నుంచి కారు పోనిచ్చారు. కిలోమీటర్ పైగా కారు ఆమెపై పోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డారు. కళ్ల ముందే భార్య చనిపోవడంతో తట్టుకోలేక పోయారు. కన్నతల్లి చనిపోవడాన్ని కూతురు జీర్ణించుకోలేక పోయారు. తమకు న్యాయం జరగడం లేదని తండ్రీకూతుళ్లు రోదిస్తున్నారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత అరెస్ట్ జరగడంతో తమను న్యాయం జరగదని అంటున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 09 , 2024 | 08:25 PM

Advertising
Advertising
<