ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha polls: 10 వాగ్దానాలతో టీఎంసీ మేనిఫెస్టో రిలీజ్

ABN, Publish Date - Apr 17 , 2024 | 04:57 PM

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ మరో రెండ్రోజుల్లో ఉందనగా ఎన్నికల మేనిఫెస్టోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. తొలి దశలో కూచ్‌బెర్, అలిపుర్‌దౌర్, జలపాయ్‌గురిలో పోలింగ్ జరుగనుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది.

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) తొలి విడత పోలింగ్ మరో రెండ్రోజుల్లో ఉందనగా ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto)ను తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. తొలి దశలో కూచ్‌బెహర్, అలిపుర్‌దౌర్, జలపాయ్‌గురిలో పోలింగ్ జరుగనుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది.

West Bengal: ఇండియా కూటమి గెలిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రద్దు.. దీదీ సంచలన ప్రకటన


పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పశ్చిమబెంగాల్‌లో అమలు చేసేది లేదని మేనిఫెస్టోలో టీఎంసీ స్పష్టంచేసింది. 'ఇండియా' కూటమిలో భాగంగా కేంద్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలిపింది. ఉద్యోగాలకు భరోసా, యూనివర్శల్ హౌసింగ్, ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు వంటి హామీలను టీఎంసీ మేనిఫెస్టో ఇచ్చింది. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలో పొత్తులు లేనప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమికి తాము మద్దతిస్తున్నట్టు టీఎంసీ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 17 , 2024 | 04:57 PM

Advertising
Advertising