ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers Protest: నేడు రాజధానిలో మరోసారి రైతుల పాదయాత్ర.. కారణమిదే..

ABN, Publish Date - Dec 02 , 2024 | 07:13 AM

రైతులు మరోసారి ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు (డిసెంబర్ 2న) దాదాపు 10 రైతు సంఘాలు ఢిల్లీలో అడుగుపెట్టనున్నాయి. పార్లమెంట్‌ను ముట్టడిస్తామని రైతులు ప్రకటించారు. ఇదే సమయంలో వీరిని ఆపడానికి పోలీసులు పూర్తి సన్నాహాలు చేశారు.

Farmers Protest Delhi

కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం, ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2న రైతులు ఢిల్లీ (delhi) వైపు పాదయాత్ర చేస్తారని భారతీయ కిసాన్ పరిషత్ ప్రకటించింది. భూసేకరణ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు 10% అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలని, కొత్త చట్టపరమైన ప్రయోజనాలను అమలు చేయాలని, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర కమిటీ సిఫార్సులను ఆమోదించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త్ కిసాన్ మోర్చా వంటి ఇతర రైతు సంఘాలు కనీస మద్దతు ధర (MSP) వంటి డిమాండ్లను కోరుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 10 రైతు సంఘాలు పార్లమెంట్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి.


ఆన్‌లైన్ విధానంలో స్కూల్స్

ఈ రోజు 12 గంటలకు మహామాయ ఫ్లైఓవర్ కింద నుంచి రైతులు తమ పాదయాత్రను ప్రారంభిస్తారు. దీంతో రైతులను అడ్డుకునేందుకు నోయిడా పోలీసులు గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీకి కలిపే అన్ని సరిహద్దుల్లో అడ్డంకులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి వచ్చే కొన్ని మార్గాలను మూసివేసి రూట్లను దారి మళ్లించారు. పాఠశాలలను కూడా ఆన్‌లైన్‌లోకి మార్చారు. ఢిల్లీ, గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ నుంచి ఢిల్లీకి వచ్చి వెళ్లేందుకు ప్రజలు మెట్రోను ఉపయోగించాలని నోయిడా పోలీసులు విజ్ఞప్తి చేశారు.


ఆ ప్రాంతాల్లో ఆంక్షలు

యమునా ఎక్స్‌ప్రెస్‌వే నుంచి నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఢిల్లీకి, సిర్సా నుంచి పారిచౌక్ మీదుగా సూరజ్‌పూర్‌కు వెళ్లే రహదారిపై అన్ని వాహనాల రాకపోకలు మూసివేయబడతాయి. ఈ క్రమంలో నోయిడా పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. శంభు సరిహద్దులో దేశంలోని నేతలందరితో చర్చించిన తర్వాత, నిత్యావసర వస్తువులతో శాంతియుతంగా కాలినడకన ఢిల్లీకి వెళ్లాలని రెండు ఫోరమ్‌లు నిర్ణయించాయి.


నేతల డిమాండ్లు

ప్రభుత్వం మమ్మల్ని వెళ్లేందుకు అనుమతిస్తే, అంబాలా కాకుండా మరికొన్ని చోట్ల గుంపు ఆగుతుందని సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. రైతులు కాలినడకన రావాలని కోరితే తమకు అభ్యంతరం లేదని హర్యానా వ్యవసాయ మంత్రి ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు తమ ప్రకటనకు కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నామని రైతు నేతలు అన్నారు. మమ్మల్ని 10 నెలలుగా ఆపివేశారని, నేటికీ కూడా ఇంకా ఆపుతున్నారని పేర్కొన్నారు. టీవీ చర్చల్లో బీజేపీ అధికార ప్రతినిధులు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం రైతు కూలీలతో మాట్లాడదలుచుకోవడం లేదని, ఒక నిర్దిష్ట ప్రతిపాదనను తీసుకువస్తే సంతోషకరంగా ఉంటుందని వెల్లడించారు రైతు నేతలు.


ఇవి కూడా చదవండి:

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 02 , 2024 | 07:17 AM