ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls: బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల కమిషన్‌కు తృణమూల్ ఫిర్యాదు

ABN, Publish Date - Mar 22 , 2024 | 08:04 PM

పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమ జోక్యానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘానికి సమాంతరంగా తన కార్యాలయానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఈసీఐ దృష్టికి తెచ్చింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ (CV Ananda Bose)పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)కి తృణమూల్ కాంగ్రెస్ (TMC) శుక్రవారంనాడు ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమ జోక్యానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘానికి సమాంతరంగా తన కార్యాలయానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఈసీఐ దృష్టికి తెచ్చింది.


''గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌ను నియంత్రించండి. ఎన్నికల ఫిర్యాదుల రిపోర్టింగ్, పర్యవేక్షణకు సమాంతర ఎలక్షనీరింగ్ సిస్టమ్‌ను ఆయన నడుపుతున్నారు'' అని టీఎంసీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల్లో ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపేందుకు 'లోక్‌ సభ' పోర్టల్‌ను గవర్నర్ బోస్ ప్రారంభించారని ఆరోపించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్టు ఈసీఐ ప్రకటించిన తరువాతే గవర్నర్ ఈ చర్యకు దిగారని తెలిపింది. గవర్నర్ చర్య రాజ్యాంగానికి 'ఆల్ట్రా వైరస్' అని, గవర్నర్ నేరుగా పోర్టల్ ప్రారంభించడం ఈసీఐకి ఉన్న అధికారాలను బలహీనపరచడమే కాకుండా ప్రజాసమస్యలను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం అవుతుదని, ఇందువల్ల ప్రజల్లో అనవసర గందరగోళానికి తావిస్తుందని వివరించింది. గవర్నర్ ఇటీవల కూచ్ బెహార్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని దిన్‌హటాలో పర్యటించినట్టు రాజ్ భవన్ ట్వీట్లు, స్క్రీన్ షాట్లు చెబుతున్నాయని, ఈ చర్య అనేక ప్రశ్నలకు తావిస్తోందని తెలిపింది. గవర్నర్ తన పర్యటనలో సీతల్‌కుచి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న బారెన్ చంద్ర బర్మన్‌ను కూడా కలుసుకున్నారని పేర్కొంది. గవర్నర్ నిష్పాక్షికంగా, గౌరవప్రదంగా ఉండాలని, రాజకీయ విభేదాలు, అంశాలకు దూరంగా ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక రూలింగ్‌ను కూడా టీఎంసీ తన ఫిర్యాదులో ప్రస్తావించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 08:04 PM

Advertising
Advertising