Tungabhadra Dam: సాహసమే ఊపిరిగా..
ABN, Publish Date - Aug 17 , 2024 | 12:37 PM
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు.
- తుంగభద్ర డ్యాం గేట్‌కు స్టాప్‌లాగ్ బిగించడంలో అధికారుల పట్టుదల
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు. ఓ పక్క డ్యాం గేట్లద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగా తయారు చేసిన స్టాప్‌లాగ్(Stoplog) బిగించేందుకు గోడకు ఉండే ఒక లాక్ అడ్డు వచ్చింది. దాన్ని తొలగిస్తే గేట్లు గోడలు దెబ్బతినిపోతాయి. ఇందుకు ఇంజనీయర్లు కొత్త ఆలోచన చేశారు.
ఇదికూడా చదవండి: Chennai: బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ?
స్టాప్‌లాగ్‌ను పైనుండి గేటు గాడిలో అమర్చాలని నిర్ణయించుకున్నారు. గేటుకు ఉండే కౌంటర్ వెయిట్‌ను కిందకు దించేశారు. పైన ఉండే హోస్టుప్లాట్‌ఫారం తొలగించారు. ఈరెండు తొలగించేందుకు రాత్రి వరకూ సమయం పట్టింది. ఇక రాత్రి స్టాప్‌లాగ్‌ను దించేందుకు పనులను ప్రారంబించారు. ఒక వైపు తేలిక పాటి జల్లులు కురుస్తున్నాయి. అయినా ఇంజనీయర్లు(Engineers) ఏమాత్రం పట్టు సడలించుకోకుండా పనులు చేశారు.
హోస్టుప్లాట్ ఫారం బరువు 32 టన్నులు ఉండగా, కౌంటర్ వెయిట్ గేటు తూకం 40 టన్నులు ఉంది. ఈ రెండూ కిందకు దించేశారు. నూతనంగా తయారు చేసిన స్టాప్‌లాగ్ ఒక్కక్కటి 12 నుండి 13 టన్నులు బరువు ఉంటుంది. శుక్రవారం రాత్రి ఎంత సమయం అయినా స్టాప్‌లాక్ బిగించాలనే పట్టుదలతో ఇంజనీయర్లు కృషిచేశారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటలకు విజయం సాధించారు. ఫస్ట్ ఎలిమెంట్‌ను దాని స్థానంలోకి చేర్చారు.
ఇంకా నాలుగు భాగాలను గేట్ స్థానంలో బిగించాల్సి ఉంది. ఆ దిశగా పనులు సాగుతున్నాయి. సీడబ్ల్యుసీ అధికారులు, ఏపీ, కర్ణాటక మంత్రులు, ముఖ్యమంత్రులు జరుగుతున్న పనుల గురించి ఆరాతీస్తున్నారు. పనులు చేసే సమయంలో ఊహించని ప్రమాదం సంభవిస్తే చికిత్స చేయడం కోసం వైద్యులు, అంబులెన్సులను అక్కడే మొహరించారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 17 , 2024 | 12:37 PM