Tungabhadra: కలుషితం నుంచి కాపాడుకోవాలి.. 30 నుంచి ‘నిర్మల తుంగభద్ర అభియాన్’
ABN, Publish Date - Dec 17 , 2024 | 01:30 PM
కొప్పళ జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర నది(Tungabhadra River) రోజు రోజుకూ కలుషితమవుతోంది. సాగు, తాగు నీరందించే నది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో నిండిపోతోంది.
- నది పరిశుభ్రతే ధ్యేయం
బళ్లారి(బెంగళూరు): కొప్పళ జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర నది(Tungabhadra River) రోజు రోజుకూ కలుషితమవుతోంది. సాగు, తాగు నీరందించే నది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో నిండిపోతోంది. తాలూకాలోని మునిరాబాద్ నుంచి హులిగి మార్గం వరకు కాలుష్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర కర్ణాటక(North Karnataka)లోని హులిగమ్మ దేవి, హులిగమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు నదిలో స్నానాలు ఆచరించి బట్టలు, ప్లాస్టిక్ ఆహార పదార్థాలను అక్కడే పారేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: ముడుపుల ఆరోపణలపై ‘విజయేంద్ర’ ఆగ్రహం..
దీంతో నదిలో వ్యర్థాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి మంగళ, శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో లక్షలాది మంది భక్తులు హులిగిని దర్శించుకుంటారు. భక్తుల స్నానాల కారణంగా కాలుష్యం పెరుగుతోంది. ఇక్కడ స్నానాలు చేయవద్దంటూ హులిగి ఆలయ నిర్వాహక బోర్డు ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. అయినా భక్తుల ధోరణిలో మార్పు రాలేదు. ఇక ఆనెగొంది చుట్టు ప్రక్కల అధికంగా వ్యర్థాలు నదిలో చేరుతున్నాయి. కంప్లి వంతెన వద్ద చెత్తాచెదారాలు అధికంగా చెత్త పారవేస్తున్నారు.
నది సమీపంలోని ఫ్యాక్టరీలు, చుట్టుప్రక్కల పట్టణాలు, గ్రామాల నుంచి అధికంగా వ్యర్థాలు నదిలోకి వదులుతున్నారు. నది కాలుష్యంపై ప్రజల్లో గతంలో జాగృతి కార్యక్రమాలు నిర్వహించినా అవి ఎక్కడా అమలు కావడం లేదు... ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం శివమొగ్గలోని జాతీయ స్వాభిమాన ఆందోళన సమితి, పర్యావరణ ట్రస్ట్ సంయుక్తంగా శృంగేరిలో గంగడికల్లు నుండి గంగావతి(Gangavati) తాలూకా కిష్కింద వరకు పాదయాత్ర జరిపి ‘‘నిర్మాలా తుంగభద్రా అభియాన’’ ప్రారంభించింది.
ఈ నెల 30న కొప్పళ జిల్లాలో అభియాన ప్రారంభం కానుంది. గంగావతిలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అభియాన కార్యక్రమంలో నది పరిశుభ్రత గురించి ప్రజల్లో జాగృతి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్వాహకులు తెలిపారు. నదులను ప్రేమిద్దాం... నదులను కాపాడుకుందాం... నదిలో పువ్వులు, ఆకులు, దండలు వేయవద్దని, జీవనదులను కలుషితం చెయ్యరాదంటూ ప్రధాన నినాదాలతో అభియానను చేపట్టనున్నారు.
ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు
ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
Read Latest Telangana News and National News
Updated Date - Dec 17 , 2024 | 01:30 PM