ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర జలాశయం..

ABN, Publish Date - Jul 20 , 2024 | 01:01 PM

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి రోజురోజుకు ఇన్‌ఫ్లో ఎక్కువై నిండుకుండలా మారుతోంది. జలాశయంలో అత్యధిక ఇన్‌ఫ్లో వుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కంప్లి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి రోజురోజుకు ఇన్‌ఫ్లో ఎక్కువై నిండుకుండలా మారుతోంది. జలాశయంలో అత్యధిక ఇన్‌ఫ్లో వుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 59.056 టీఎంసీలు నీరు జలాశయంలో చేరాయి. జలాశయం పైభాగంలోని తుంగ, భద్ర జలాశయాలు నిండి, తీర్థహళ్లి, కొడుగు, మలనాడు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం వుండటంతో అనుకున్న స్థాయికన్నా ఎక్కువగా నీరు చేరుతోంది. ఇప్పటికే రైతన్నలు నాట్లు వేసేందుకు సంసిద్దులయ్యారు. తుంగభద్ర కాలువ నుంచి సాగునీరు కూడా విడుదల చేశారు. హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు కూడా జలాశయం నుంచి సాగునీరు విడుదల చేశారు.

ఇదికూడా చదవండి: UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా!.. 5 ఏళ్లు పూర్తికాకుండానే


జలాశయాలు కళకళ..

బెంగళూరు: కావేరి నది(Kaveri river)కి అనుబంధమైన పెద్ద జలాశయం కేఆర్‌ఎస్‏కు శుక్రవారం సాయంత్రానికి 118 అడుగులకు నీటిమట్టం చేరింది. కేఆర్‌ఎస్‌ గరిష్ట మట్టం 124.80 అడుగులుగా ఉంది. మరో 6 అడుగులు మాత్రమే సంపూర్ణ భర్తీకి మిగిలింది. 46,658 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 2,707 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా ఉంది. 49 టీఎంసీల గరిష్ట లక్ష్యంలో 40 టీఎంసీలు చేరింది. గత ఏడాది ఇదే రోజునాటికి 89.90 అడుగుల లక్ష్యంలో కేవలం 15.81 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. 120 అడుగుల స్థాయికి నీరు చేరితే జలాశయం సురక్షితం దృష్ట్యా కేఆర్‌ఎస్‌ నుంచి లక్ష క్యూసెక్కులను విడుదల చేస్తారు. శ్రీరంగపట్టణ తాలూకాలో 53, పాండవపురలో 15, మలవళ్లిలో 21తోపాటు హేమావతి జలాశయానికి సంబంఽధించిన లోతట్టు ప్రాంతాలు, కేఆర్‌పేటలో 3 గ్రామాలకు సమస్య ఏర్పడే అవకాశం ఉంది.


అధికారులు సంబంధిత గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. జిల్లా, తాలూకా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి నోడల్‌ అధికారులను నియమించారు. కాగా కేరళతోపాటు కావేరి తీర ప్రాంతాల్లో వర్షబీభత్సం కొనసాగుతుండడంతో మరింత అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేఆర్‌ఎ్‌సలో నీటి సామర్థ్యం పెరుగుతుండడంతో మండ్య రైతులలో హర్షం వ్యక్తమవుతోంది.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 01:01 PM

Advertising
Advertising
<