ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tungabhadra water: తీరనున్న ప్రజల ‘పానీ’ పాట్లు..

ABN, Publish Date - Aug 08 , 2024 | 11:21 AM

ఇంటిముందర చెరువు ఉన్నా, తాగడానికి మాత్రం నీళ్లు లేని పరిస్థితి హోస్పేట నగర(Hospet city) ప్రజలది. వారికి సమీపంలోనే టీబీ డ్యాం(TB dam) ఉన్నా నగరానికి తాగునీటి సరఫరాలో అన్నీ అడ్డంకులే.

- రూ.308 కోట్లతో విజయనగర గ్రామాలకు తుంగభద్ర నీరు

- హోస్పేట ప్రజల తాగునీటి కష్టాలకు ఇక ఫుల్‌స్టాప్‌

బళ్లారి(బెంగళూరు): ఇంటిముందర చెరువు ఉన్నా, తాగడానికి మాత్రం నీళ్లు లేని పరిస్థితి హోస్పేట నగర(Hospet city) ప్రజలది. వారికి సమీపంలోనే టీబీ డ్యాం(TB dam) ఉన్నా నగరానికి తాగునీటి సరఫరాలో అన్నీ అడ్డంకులే. వాటినన్నంటినీ అధిగమిస్తూ ఇంతకాలం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజల కోసం అధికారులు కొత్త నీటిప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.308 కోట్ల కర్ణాటక మైనింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిహోబిలిటేషన్‌ కార్పొరేషన్‌ (కేఎంఇఆర్‌సీ) నిధులతో ఈ నీటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రచించారు.

ఇదికూడా చదవండి: LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు


ఇందుకోసం తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోని డెడ్‌ స్టోరేజీ నీటిని వినియోగించుకుంటారు. పావగడ ప్రాజెక్టు దగ్గర ప్రత్యేక జాక్వెల్‌ నిర్మించి, టీబీ డ్యాం రెండో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వద్ద కొండపైన భారీ ట్యాంకు నిర్మిస్తారు. అక్కడే వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ నుండి నగరంలోని అన్ని ఓవర్‌ హెడ్‌ ట్యాంకులకు నీటిని సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు. గతంలో ఈ నీటిప్రాజెక్టు రిపోర్టును కేఎంఇఆర్‌సీకి పంపారు. మొత్తం వ్యయం రూ. 308.93 కోట్లలో 80శాతం అంటే రూ. 250 కోట్లు మంజూరు అవుతుందని అంచనా వేశారు.


మిగిలిన 20 శాతం నిధులు ప్రజా విరాళాల ద్వారా సేకరించాలని భావించారు. అవేవీ లేకుండానే వంద శాతం కేఎంఇఆర్‌సీ(KMERC) నిధులతో ఈ నీటి ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు అందగానే మరి కొన్నిరోజుల్లో టెండర్లు కూడా పిలవనున్నారు. హొస్పేట్‌ నగరంలో ప్రస్తుతం 2.91 లక్షల జనాభా ఉంది. 2055 నాటికి జనాభా 5.50 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. వాటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక రూపొందించారు. టీబీ డ్యాం సమీపంలోని కొండపై 10 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. ఇక్కడ ట్యాంక్‌, నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు.


ఇక్కడ నుంచి ట్యాంకులకు పంపింగ్‌ లేకుండానే నీరు సాఫీగా ప్రవహిస్తుంది. అందుకే ఎత్తుగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూ ర్తయితే ఇంటింటికీ నీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం మీద రూ. 308 కోట్లతో నిర్మాణం చేపట్టే ఈ నీటి ట్యాంకు వల్ల భవిష్యత్తులో విజయనగర జిల్లా(Vizianagaram District)లోని మెజారిటీ గ్రామాలకు తాగునీటి ఇబ్బంది ఉండదని విజయనగర డీసీ ఎంఎస్‌ దివాకర్‌ తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2024 | 11:21 AM

Advertising
Advertising
<