TVK: టీవీకేలో 120 మంది జిల్లా కార్యదర్శులు
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:10 PM
ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) బలోపేతానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది.
- ముమ్మరంగా ఎంపిక ప్రక్రియ
చెన్నై: ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) బలోపేతానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. విల్లుపురం జిల్లా విక్రవాండిలో టీవీకే తొలి మహానాడు విజయవంతం కావడంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో చేపడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుస్సీ ఆనంద్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: Vande Bharat train: ‘వందే భారత్’ రైలు ఆహారంలో బొద్దింకలు
మరి కొంతమంది రాష్ట్రస్థాయి నిర్వాహకులను కూడా మహానాడు ముందు నియమించారు. జిల్లాస్థాయిలో నిర్వాహకులను ఇప్పటివరకు నియమించలేదు. ఇదిలా ఉండగా, 2026లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీవీకే తరఫున ఆయా నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న వారి వివరాలను సేకరించేందుకు అధిష్ఠానం నిర్ణయించింది. విజయ్ పార్టీలో 60 శాతం మందికి పైగా ఆయన అభిమానులు సభ్యులుగా ఉన్నారు. పార్టీకి జిల్లా కార్యదర్శులు వెన్నెముకలాంటి వారు కావడంతో డీఎంకే, అన్నాడీఎంకే తదితర పార్టీల్లో లాగే టీవీకేలో కూడా జిల్లా కార్యదర్శులను నియమించాలని విజయ్ భావిస్తున్నారు.
పార్టీ తరఫున 120 జిల్లా విభాగాలను రూపొందించనున్నారు. వీటికి తొలివిడతగా జిల్లా కార్యదర్శులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం విజయ్ అభిమాన సంఘంగా ఉన్నప్పటి నుంచి ప్రతిఫలం ఆశించకుండా సమాజసేవలో పాల్గొంటున్నవారు, పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషిచేస్తున్న వారి పేర్లను ఎంపిక చేసి త్వరలోనే వారిని ఇంటర్వ్యూ కూడా చేయనున్నట్లు తెలిసింది. డిసెంబరు మొదటి వారంనాటికి జిల్లా కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని టీవీకే నిర్వాహకులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: TG GOVT: వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఈవార్తను కూడా చదవండి: వాళ్లు వెళతామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: కిషన్ రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: Group 3: గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం.. అభ్యర్థులకు అలర్ట్
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: 3 నెలలైనా ఉంటా..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 17 , 2024 | 01:10 PM