Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం
ABN, Publish Date - Mar 21 , 2024 | 10:52 AM
దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్‌లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు.
దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్‌లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు. జీన్స్ కటింగ్ యూనిట్ నడుపుతున్న భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. బిల్డింగ్ కూలిపోయిన సమయంలో వారు అక్కడే ఉండటంతో తప్పించుకునే మార్గం లేక శిథిలాల కింద నలిగిపోయారు.
తెల్లవారు రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫైర్ కంట్రోల్ రూమ్ కు విషయం చెప్పారు. రెస్క్యూ టీమ్‌తో పాటు నాలుగు అగ్నిమాపక యంత్రాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని గురు తేగ్ బహదూర్ (జీటీబీ) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కబీర్ నగర్‌కు చెందిన అర్షద్, తౌహిద్ గా గుర్తించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 21 , 2024 | 10:52 AM