ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uddhav Thackeray: సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి, కాంగ్రెస్ సైతం ఆ పని మానాలి

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:59 PM

'మహా వికాస్ అఘాడి'లోని తమ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌కు ఉద్ధవ్ థాకరే హితవు పలుకుతూ, సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాట్లాడటం మానుకోవాలని, బీజేపీ సైతం నెహ్రూను టార్గెట్ చేసి మాట్లాడవద్దని అన్నారు.

ముంబై: హిందుత్వ సిద్ధాంతకర్త వీర సావర్కర్ (Veer Savarkar)కు దేశ అత్యున్నత పౌర పురస్కారం "భారతరత్న'' ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) డిమాండ్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం నాగపూర్‌లో ఉన్న థాకరే మీడియాతో మాట్లాడుతూ, వీరసావర్కర్‌కు బీజేపీ ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పునరుద్ఘాటించారు.

Vijay Diwas: మోదీ పోస్టుపై బంగ్లాదేశ్ అక్కసు


''దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే డిమాండ్‌పై ప్రధానమంత్రి మోదీకి లేఖలు రాశారు. దాని సంగతేమైంది? ఇప్పటికీ వీరసావర్కర్‌కు భారతరత్న ప్రకటించలేదు. ఇవాళ కూడా ఆయనే (ఫడ్నవిస్) సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన డిమాండ్‌ను బీజేపీ పరిశీలించకపోతే వీరసావర్కర్ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేనట్టే'' అని థాకరే అన్నారు.


కాంగ్రెస్ సైతం దూరంగా ఉండాలి..

'మహా వికాస్ అఘాడి'లోని తమ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌కు ఉద్ధవ్ థాకరే హితవు పలుకుతూ, సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాట్లాడటం మానుకోవాలని, బీజేపీ సైతం నెహ్రూను టార్గెట్ చేసి మాట్లాడవద్దని అన్నారు. గతం గురించి ప్రస్తావించడం మాని భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. ఆ ఇద్దరు నేతలు (సావర్కర్, నెహ్రూ) ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవి అప్పటి కాలానికి తగినవని అన్నారు. మోదీ సైతం నెహ్రూ పేరును పదేపదే లేవనెత్తకుండా సంయమనం పాటించాలని సూచించారు.


థాకరే డిమాండ్‌పై మిశ్రమ స్పందన

వీర సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలనే ఉద్ధవ్ థాకరే డిమాండ్‌పై రాజకీయ మిత్రులు, ప్రత్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మహారాష్ట్రలో థాకరే మిత్రపక్షమైన ఎన్‌సీపీ ఎస్‌పీ నేత శరద్ పవార్ ఈ అంశంపై మౌనం వహించారు. ఉద్ధవ్ థాకరే ఏమి చెప్పారో, ఆయన డిమాండే ఏమిటో తనకు తెలియదని, దానిపై తాను కామెంట్ చేయనని ఎన్‌సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఏక్‌నాథ్ షిండే శివసేన నేత, క్యాబినెట్ మంత్రి భరత్ గోగావలే మాట్లాడుతూ, వీరసావర్కర్‌కు అవార్డు అంశంపై మహాయుతి నేతలు సమష్టి నిర్ణయం తీసుకుంటారని, హిందుత్వకు దూరమైన ఉద్ధవ్ థాకరేకు వీర సావర్కర్ గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..

Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్

For National News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 05:59 PM