ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata: ఆర్ జీ కర్ ఆసుపత్రిలో బ్యాగ్ కలకలం.. ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు చర్చలు

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:14 PM

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. సదరు బ్యాగ్‌ను ఎవరు తీసుకు వెళ్లక పోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జాగిలాలతో సహా పోలీసులు ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు.

కోల్‌కతా, సెప్టెంబర్ 12: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. సదరు బ్యాగ్‌ను ఎవరు తీసుకు వెళ్లక పోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జాగిలాలతో సహా పోలీసులు ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోని బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అయితే ఈ బ్యాగ్‌లో ఏమి లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందితోపాటు రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలోని రోగులను బయటకు పంపారు.

Ganpati Puja celebrations: సీజేఐ ఇంట ప్రధాని మోదీ.. రేగిన వివాదం


ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని.. అలాగే వైద్య రంగాన్ని ప్రక్షాళణ చేయాలంటూ జూనియర్ వైద్యులు దాదాపు నెలకు పైగా ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో వారితో చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.

Also Read: Jammu Kashmir Assembly Elections: అలా కాకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తా..!


ఈ రోజు సాయంత్రం అంటే.. సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. అయితే జూనియర్ వైద్యులు డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం పక్కన పెట్టింది. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో చర్చలు జరిగేందుకు సానుకూలంగా స్పందించింది. అలాగే ఈ చర్చలకు కేవలం 15 మంది మాత్రమే రావాలని షరతు విధించింది.

Also Read: Viral Video: లంగా గాడు.. ఈ నా కొడుకు ఆ స్థాయి ఉందా


ఈ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ జూనియర్ వైద్యుల చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తొసి పుచ్చింది. కానీ ఈ చర్చలను మాత్రం రికార్డ్‌ చేస్తామని స్పష్టం చేసింది. అదికూడా పారదర్శకత కోసమేనని ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ తెలిపారు. ఈ మేరకు జూనియర్ వైద్యులకు రాసిన లేఖలో ఈ అంశాలను ఆయన పేర్కొన్నారు.

Also Read: karnataka: మాండ్యలో మత ఘర్షణలు: 52 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఆమెకు న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు దాదాపు నెలకు పైగా ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో చర్చలకు రావాలని జూనియర్ వైద్యులను ప్రభుత్వం ఆహ్వానించింది. అందుకు పలు షరతులను జూనియర్ డాక్టర్లు తెర మీదకు తీసుకు వచ్చారు. ముచ్చటగా మూడోసారి చర్చలకు జూనియర్ డాక్టర్లను ఆహ్వానించడంతో ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు చర్చలు జరపనున్నారు.

Also Read: RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 12 , 2024 | 04:15 PM

Advertising
Advertising