ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Health Department : షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది?

ABN, Publish Date - Jul 07 , 2024 | 02:31 AM

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌పై గందరగోళం నెలకొంది. నీట్‌ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్‌ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి.

  • నీట్‌ యూజీ నిరవధిక వాయిదా వార్తలను ఖండించిన కేంద్రం

  • నెలాఖరులో నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌!

  • రోజుకో వార్తతో విద్యార్థుల్లో టెన్షన్‌

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ జూలై 6(ఆంధ్రజ్యోతి): నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌పై గందరగోళం నెలకొంది. నీట్‌ యూజీ జాతీయ కోటా కౌన్సెలింగ్‌ నిరవధికంగా వాయిదా పడిందని శనివారం వార్తలు వెలువడ్డాయి. నీట్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను ఇటీవల సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలాంటి అడ్డంకులు లేకపోయినా కౌన్సెలింగ్‌ను ఎందుకు నిరవధికంగా వాయిదా వేస్తున్నారని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. అసలు కౌన్సెలింగ్‌ తేదీలే ప్రకటించలేదని, అలాంటప్పుడు వాయిదాకు అవకాశం ఎక్కడని ప్రశ్నించింది. గత మూడేళ్లుగా ఎప్పుడూ జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభం కాలేదని గుర్తు చేసింది.

2021 నీట్‌ కౌన్సెలింగ్‌ 2022 జనవరిలో జరిగిందని, 2022 కౌన్సెలింగ్‌ అదే ఏడాది అక్టోబరులో జరిగిందని, 2023 కౌన్సెలింగ్‌ అదే ఏడాది జూలై 20న మొదలైందని ప్రస్తావించింది. ఈ విద్యా సంవత్సరానికి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ తేదీలను జూలై మూడో వారంలో ఖరారు చేస్తామని, పీజీ కౌన్సెలింగ్‌ తేదీలను ఆగస్టు రెండో వారం తర్వాత ఖరారు చేస్తామని గత నెలలోనే జాతీయ వైద్య కమిషన్‌ చెప్పిందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తు చేసింది. వాటికి అనుగుణంగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని చెప్పింది.

సుప్రీంకోర్టు విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం చేపట్టనున్నారు. కాగా, కొన్ని వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, తొలిదశ కౌన్సెలింగ్‌కే ఆ సీట్లు అందుబాటులో ఉండేట్లు చూస్తామని జాతీయ వైద్య కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.


నీట్‌ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని డిమాండ్లు ఊపందుకుంటుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం భారీఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువేమీ లేకుండా రద్దు చేయడం వల్ల నిజాయితీతో పరీక్ష రాసిన లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని చెప్పింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నీట్‌ పరీక్షను రద్దు చేసి, మరింత పారదర్శకంగా నిర్వహించాలని శనివారం డిమాండ్‌ చేశారు. నీట్‌ అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని కోరారు.

విద్యార్థుల్లో టెన్షన్‌

నీట్‌పై రోజుకో రకంగా వస్తున్న వార్తలతో రాష్ట్ర విద్యార్ధుల్లో ఒకరకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవేళ నీట్‌ రద్దు అయితే ఎలా అన్న టెన్షన్‌ వారిలో నెలకొంది. మెడిసిన్‌లో సీటు రాకపోతే ఇతర కోర్సులకు వెళ్లాలనేకునే విద్యార్దులు పెద్దసంఖ్యలో ఉన్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే కొద్దీ ఇతర కోర్సుల్లో చేరే అవకాశం కూడా కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్‌ పరీక్షలకు తెలంగాణ నుంచి 77,849 మంది హాజరు కాగా 47,371 మంది(60 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కేవలం 58 శాతమే ఉత్తీర్ణత సాధించగా...ఈ మారు అది రెండు శాతం మేరకు పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 56 మెడికల్‌ కాలేజీలుండగా.. వాటిలో 8515 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి.

Updated Date - Jul 07 , 2024 | 02:31 AM

Advertising
Advertising
<