Chirag Paswan: ఓవర్ స్పీడ్...కేంద్ర మంత్రి కారుకు చలానా
ABN, Publish Date - Sep 02 , 2024 | 07:16 PM
బీహార్‌లో అతివేగం కారణంగా కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ వాహనానికి ఈ-చలానా జారీ అయింది. చిరాగ్ పాశ్వాన్ ప్రయాణిస్తున్న వాహనం బీహార్‌లోని హాజీపూర్ నుంచి చంపారన్‌కు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ-చలానా జారీ అయింది.
న్యూఢిల్లీ: బీహార్‌లో అతివేగం కారణంగా కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) వాహనానికి ఈ-చలానా జారీ అయింది. చిరాగ్ పాశ్వాన్ ప్రయాణిస్తున్న వాహనం బీహార్‌లోని హాజీపూర్ నుంచి చంపారన్‌కు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ-చలానా జారీ అయింది. పరిమితికి మించి వేగంగా వెళ్తుండగా గుర్తించిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ఆయన వాహనానికి ఆటోమేటిక్ చలానా జారీ చేసినట్టు తెలుస్తోంది.
Supreme Court: బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కాగా, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, మోటార్ వాహనాల చట్టం కింద రాష్ట్రంలోని 13 టోల్ ప్లాజాల వద్ద ఈ-డిటెన్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిచినందుకు గతం వారం రోజుల్లో రూ.9.49 కోట్లు విలువచేసే 16,755 ఈ-చలానాలను బీహార్ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు. వీటిలో 9,676 చలానాలు ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరయిన వాహనాలకు చెందినవి కాగా, 7,079 వాహనాలు బీహార్‌లో రిజిస్టర్ అయిన వాహనాలు ఉన్నాయి. ఈ-డిటెన్షన్ సిస్టం వాహనాలను చెక్ చేయడంతో పాటు, తగిన డాక్యుమెంట్లు లేకుంటే ఆటోమాటిక్ చలానాలను సైతం జారీ చేస్తుంది.
Read More National News and Latest Telugu New
Updated Date - Sep 02 , 2024 | 07:16 PM