ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Minister: కేంద్ర మంత్రి కుమార స్వామికి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

ABN, Publish Date - Jul 28 , 2024 | 07:10 PM

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్. డి. కుమార స్వామి ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆయన ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది.

Union minister HD Kumaraswamy

బెంగళూరు, జులై 28: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్. డి. కుమార స్వామి ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో ఆయన ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని విలేకర్లు గమనించి.. వెంటనే కేంద్ర మంత్రికి తెలియజేశారు.

Also Read: Delhi UPSC aspirants death: ఆప్ ప్రభుత్వమే లక్ష్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విమర్శలు

Also Read: Uttar Pradesh: అఖిలేష్ రాజీనామా.. కొత్త ప్రతిపక్ష నేత ఎంపిక


ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా ఆందోళన కోసం..

దీంతో హెచ్‌డి కుమారస్వామి తన ముక్కు రంధ్రాలను గుడ్డతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమ్యారు. ఆ క్రమంలో ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ముక్కు నుంచి ధారాపాతంగా కారుతుండడంతో.. ఆయన చొక్క మొత్తం రక్తంతో తడిసిపోయింది. ముడా కుంభకాణంపై పోరాటానికి సంబంధించిన కార్యచరణపై ఆదివారం బీజేపీ, జేడీఎస్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: Viral Video: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. వీడియోలో వివరించిన యూట్యూబర్ ?

Also Read: Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు


తనయుడితో పాటు పాల్గొన్న కుమారస్వామి..

ఈ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బిఎస్ యడ్యూరప్ప, హెచ్ డి కుమార స్వామి నిఖిల్ గౌడ సైతం హాజరయ్యారు అయితే ఈ ఏడాది మార్చిలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ట్రాన్స్‌కాథెటర్ ఆరోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్‌ (టీఏవీఐ) జరిగింది. అంతేకాదు గతంలో కుమారస్వామికి రెండు సార్లు గుండె పోటు వచ్చింది.

Also Read:West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్


మోదీ కేబినెట్‌లో చోటు..

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య ఎంపీగా జేడీ(ఎస్) అభ్యర్థిగా హెచ్ డి కుమారస్వామి బరిలో నిలిచి గెలిచారు. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో జేడీ(ఎస్) పార్టీ ఒకటి. ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్‌లో హెచ్ కుమారస్వామికి చోటు దక్కింది. కీలక మంత్రిత్వ ఉక్కు శాఖ మంత్రిగా హెచ్ డి కుమారస్వామి బాధ్యతలు చేపట్టారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 07:43 PM

Advertising
Advertising
<