ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుమారస్వామి 50 కోట్లు డిమాండ్‌ చేశారు

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:44 AM

కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌టాటా సంచలన ఆరోపణలు చేశారు.

  • రియల్టర్‌ విజయ్‌ టాటా ఫిర్యాదు

బెంగళూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌టాటా సంచలన ఆరోపణలు చేశారు. కుమారస్వామితోపాటు జేడీఎస్‌ నేత రమేశ్‌గౌడపై అమృతహళ్లి పోలీ్‌సస్టేషన్‌లో గురువారం ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ... ‘జేడీఎస్‌ ఎమ్మెల్సీ రమేశ్‌గౌడ మా ఇంటికి వచ్చారు. చన్నపట్టణ ఉప ఎన్నికల్లో నిఖిల్‌ పోటీ చేస్తున్నారని తెలిపారు. అదే సమయంలో కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడించారు. ఎన్నికల కోసం రూ.50 కోట్లు ఇవ్వాలని అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పడంతో కుమారస్వామి కోపగించుకున్నారు. వదిలేది లేదని బెదరించారు’ అని అన్నారు. ఫిర్యాదుపై పోలీసులు నాన్‌ కాగ్నిజబుల్‌ రిపోర్ట్‌(ఎన్‌సీఆర్‌) నమోదు చేశారు.

Updated Date - Oct 04 , 2024 | 03:44 AM