ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Minister: మరోసారి నేనే సీఎం.. సిద్దూ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగదు

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:37 PM

‘మరోసారి నేను ముఖ్యమంత్రి’ అవుతా.. జేడీఎస్‌ మనుగడకు ఎవ్వరి మద్దతు అవస రం లేదు.. అని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) ధీమా వ్యక్తం చేశారు.

- జేడీఎస్‌ మనుగడ ఎవరి భిక్ష కాదు

- కేంద్రమంత్రి కుమారస్వామి

బెంగళూరు: ‘మరోసారి నేను ముఖ్యమంత్రి’ అవుతా.. జేడీఎస్‌ మనుగడకు ఎవ్వరి మద్దతు అవస రం లేదు.. అని కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామి(Minister Kumaraswamy) ధీమా వ్యక్తం చేశారు. మండ్యలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2028 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగడం కల్లేనన్నారు. ప్రజలు మళ్లీ తనకే ఒక అవకాశం ఇస్తారన్న విశ్వాసం ఉందన్నారు. 2028లోగానే అటువంటి చాన్స్‌ రానుందన్నారు. తాను జ్యోతిష్యుడు కాదని అయితే విశ్వాసంతో చెబుతున్నానన్నారు. ఐదేళ్లు పాలన సాగించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానన్నారు. గతంలో 14 నెలల పాలనలో మరొకరి చేతిలో కీలుబొమ్మలాగా మారానన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Deputy CM: గవర్నర్‌ను వెంటనే రీకాల్‌ చేయాలి..


ఐదేళ్లపాటు అవకాశం ఇస్తే తన అనుభవంతో మరిన్ని మంచి పనులు చేస్తానన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కొరత లేదని, సమృద్ధిగా నిధులున్నా లూటీ సాగుతోందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఛీ కొట్టేరోజులు వచ్చాయన్నారు. ఈ విధంగా మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరికను కుమారస్వామి బయటపెట్టారు. కాగా బీజేపీతో పొత్తు కారణంగానే జేడీఎస్‏(JDS)కు మనుగడ సాధ్యమైందని చన్నపట్టణ టిక్కెట్‌ను వదులుకోవాలని బీజేపీ(BJP) నేత బసనగౌడ పాటిల్‌యత్నాళ్‌ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. జేడీఎస్‌కు ఎవ్వరూ పునర్జన్మ ఇవ్వాల్సిన పనిలేదని, దశాబ్దాల కాలంగా ఒక లక్ష్యంతో కొనసాగుతోందన్నారు. దానిని ఆపడం ఎవ్వరి తరం కాదన్నారు.


ఇదికూడా చదవండి: Group-1: గ్రూప్-1 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..

ఇదికూడా చదవండి: గద్దర్‌పై మహా పరిశోధన

ఇదికూడా చదవండి: Kishan Reddy: ముందు మూసీకి రిటైనింగ్‌ వాల్‌ కట్టండి

ఇదికూడా చదవండి: Train Schedule: ఆ రైళ్ల వేళలు మారాయ్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 20 , 2024 | 01:37 PM