ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:58 AM

భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి.

విశాఖ: భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అనే నాలుగవ జలాంతర్గామిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించినట్లు కథనాలు వెలవడ్డాయి. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మెుట్టమెుదటి జలాంతర్గామి కావడం విశేషం. ఇటీవల తెలంగాణలో నేవీ ర్యాడార్ కేంద్రం ప్రారంభించిన మరసటి రోజే అంటే.. అక్టోబర్ 16న విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 జలాంతర్గామి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది.


ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన ఎస్ఎస్‌బీఎన్ అరిఘాత్‌ను విశాఖ కేంద్రంగా రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. మరోవైపు అక్టోబర్ 9, 2025న అణుశక్తి కలిగిన మరో జలాంతర్గామిని అరిధామాన్‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొత్తగా ప్రారంభించబడిన ఎస్ఎఎస్‌బీఎన్ ఎస్-4ను దాదాపు 75శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దీనిలో 3,500 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె-4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. అయితే మెుట్టమెుదటి అణు జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిహంత్ కేవల 750కి.మీ. పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో కె-15 అణు క్షిపణులు ఉన్నాయి. కొత్తగా మరో అణు జలాంతర్గామి రక్షణ వ్యవస్థలోకి చేరి దేశానికి సేవలు అందించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పాక్‌ న్యాయవ్యవస్థకు పార్లమెంటు సంకెళ్లు!

వయనాడ్‌తో నయాజోష్‌ వచ్చేనా?

Updated Date - Oct 22 , 2024 | 12:02 PM