PM Modi: 'మహా' విజయంపై మోదీ ఫస్ట్ రియాక్షన్
ABN, Publish Date - Nov 23 , 2024 | 05:36 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన 'మహాయుతి కూటమి'కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అభినందనలు తెలిపారు. ఇది అభివృద్ధికి, సుపరిపాలనకు ప్రజలు అందించిన విజయమని అభివర్ణించారు. ఐక్యంగా మరిన్ని విజయతీరాలను సాధించాలని అభిలషించారు.
Maharashtra CM: మహారాష్ట్ర సీఎం పీఠం దక్కేదెవరికి?.. షిండే, ఫడ్నవిస్ మధ్యనే పోటీ
''ఇది అభివృద్ధి విజయం. సుపరిపాలన సాధించిన గెలుపు. సమష్టిగా ఉంటే మనం మరింత ఎత్తుకు ఎదుగుతాం. ఎన్డీయేకు ఇంత చారిత్రిక విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మహారాష్ట్ర ప్రగతికి అహరహం పాటుపడతామని ప్రజలకు బీజేపీ కూటమి హామీ ఇస్తోంది. జై మహారాష్ట్ర'' అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
233 స్థానాల్లో ఎన్డీయే విజయం
288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 233 సీట్లలో విజయ ఢంకా మోగించింది. విపక్ష మహా వికాస్ అఘాడి 50 సీట్లకు పరిమితమైంది. ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి..
Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'
Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 23 , 2024 | 06:20 PM