Loksabha Polls: శ్వాస ఆగిపోయే వరకు పిలిభిత్‌తో అనుబంధం, వరుణ్ గాంధీ ఎమోషనల్
ABN, Publish Date - Mar 28 , 2024 | 02:58 PM
పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ, యువ నాయకుడు వరుణ్ గాంధీకి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ నుంచి ఉత్తర ప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాదకు టికెట్ ఇచ్చింది. దీంతో వరుణ్ గాంధీ భావొద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
ఢిల్లీ: పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ, యువ నాయకుడు వరుణ్ గాంధీకి (Varun Gandhi) భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ నుంచి ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) మంత్రి జితిన్ ప్రసాదకు టికెట్ ఇచ్చింది. దీంతో వరుణ్ గాంధీ (Varun Gandhi) భావొద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
PM Modi: సందేశ్ ఖాళి బాధితురాలు రేఖ.. శక్తి స్వరూపిణి అని మోదీ ప్రశంసలు
వరుణ్ లేఖ
‘పిలిభిత్ నియోజకవర్గంతో చాలా మధుర క్షణాలు కలిగి ఉన్నా. మూడేళ్ల వయస్సులో తన తల్లి చేయి పట్టుకొని తొలిసారి నియోజకవర్గానికి వచ్చా. ఆ రోజు ఇక్కడి ప్రజల ఆదరణ, అభిమానం పొందుతానని అనుకోలేదు. ఇక్కడి ప్రజలు తన కుటుంబంగా మారతారని ఊహించలేదు. ఇక్కడి గొప్ప వ్యక్తులకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నా. నియోజకవర్గం ప్రజల నుంచి తాను చాలా నేర్చుకున్నా. ఆదర్శంగా ఉండటం, దయతో మెలగడం, అడంబరాలకు వెళ్లకుండా ఉండే విధానం అలవరుచుకున్నా. తాను నేర్చుకున్న అంశాలు కేవలం పార్లమెంట్ సభ్యుడిగా తనను ప్రభావితం చేయలేవు. తనకు వ్యక్తిగత ఉన్నతికి, ఎదుగుదలకు దోహదం చేశాయి. పిలిభిత్ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా తన పదవి కాలం ముగియనుంది. పిలిభిత్ ప్రజలతో తన అనుబంధం మాత్రం చివరి శ్వాస వరకు కొనసాగుతోంది అని’ వరుణ్ గాంధీ ఆ లేఖలో భావొద్వేగానికి గురయ్యారు.
PM Modi: సందేశ్ ఖాళి బాధితురాలు రేఖ.. శక్తి స్వరూపిణి అని మోదీ ప్రశంసలు
పోటీకి దూరం
వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించడంతో పిలిభిత్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే వార్తలు వినిపించాయి. వరుణ్ గాంధీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగలేదు. సుల్తాన్ పూర్ నుంచి వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. పిలిభిత్ నియోజకవర్గం నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీ గత మూడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్నారు. ఈ సారి మాత్రం పోటీకి దూరం అయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Sania Mirza: రంగంలోకి సానియా మిర్జా..!
Updated Date - Mar 28 , 2024 | 02:59 PM