LokSabha Elections: ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సూచన
ABN, Publish Date - May 23 , 2024 | 08:14 PM
దేశంలో ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఢిల్లీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విజ్జప్తి చేశారు. అందుకోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లకు ఆమె సూచించారు. ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని ఢిల్లీ ఓటర్లకు తెలిపారు.
న్యూఢిల్లీ, మే 23: దేశంలో ప్రజాస్వామ్యంతోపాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఢిల్లీ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ విజ్జప్తి చేశారు. అందుకోసం ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లకు ఆమె సూచించారు. ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని ఢిల్లీ ఓటర్లకు తెలిపారు.
దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగ సంస్థలపై దాడి జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నిరోదించే క్రమంలో క్రియాశీలక పాత్ర పోషించాలంటూ ఢిల్లీ ఓటర్లకు సోనియా వివరించారు. మే 25వ తేదీ.. అంటే శనివారం ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లకు సోనియా గాందీ వీడియో ద్వారా తన సందేశాన్ని అందించారు.
AP Elections: పిన్నెల్లి ఇలా.. ఎలా దొరికిపోయాడు..!
LokSabha Elections: బీజేపీ షోకాజ్ నోటీసు.. స్పందించిన జయంత్ సిన్హా
మే 25వ తేదీ అంటే.. శనివారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఆ క్రమంలో న్యూఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ యా లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఆమ్ ఆద్మీ పార్టీ.. తన అభ్యర్థులను బరిలో దింపింది.
Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్
ఇక మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను రంగంలో నిలిపింది. మరోవైపు మే 23వ తేదీ అంటే ఈ రోజు సాయంత్రంతో ఆరో దశ పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
Bomb threat calls: శ్రీరామ్, వెంకటేశ్వర కాలేజిలకు బాంబు బెదిరింపులు
For More Latest National News and Telugu News..
Updated Date - May 23 , 2024 | 08:15 PM