Watch Video: కొద్ది క్షణాల్లో విమానం టేకాఫ్.. ఇంతలో ఒక్కసారిగా పొగలు
ABN, Publish Date - Sep 25 , 2024 | 05:54 PM
ఎమిరేట్స్ విమానం దుబాయ్ వెళ్లేందుకు చెన్నైలోని ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై సిద్ధంగా ఉంది. గ్రౌండ్ స్టాఫ్ విమానంలో ఇంధనం నింపిన అనంతరం పైలట్ విమానం ఇంజన్ స్టార్ట్ చేయగానే విమానం వెనుక భాగం నుంచి తెల్లటి పొగలు బయటకు వచ్చాయి.
చెన్నై: దుబాయ్ (Dubai)కి వెళ్లే ఎమిరేట్స్ విమానానికి (Emirates flight)కి పెను ప్రమాదం తప్పింది. చెన్నై (Chennai) విమానాశ్రయంలో మంగళవారం రాత్రి ఎమిరేట్స్ ఫ్లైట్ EK547 టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజన్ కంపార్ట్‌మెంట్ నుంచి తెల్లటి పొగలు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ప్రయాణికులు ఇంకా విమానం ఎక్కక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటన వివరాల ప్రకారం, ఎమిరేట్స్ విమానం దుబాయ్ వెళ్లేందుకు చెన్నైలోని ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై సిద్ధంగా ఉంది. గ్రౌండ్ స్టాఫ్ విమానంలో ఇంధనం నింపిన అనంతరం పైలట్ విమానం ఇంజన్ స్టార్ట్ చేయగానే విమానం వెనుక భాగం నుంచి తెల్లటి పొగలు బయటకు వచ్చాయి. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే పైలట్లను అప్రమత్తం చేయడంతో పైలట్లు ఇంజన్‌ను ఆపేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా వెంటనే అగ్నిమాపక శకటాలను రంగంలోకి దింపారు. సుమారు 300 మంది ప్రయాణికులు ఈ విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే బోర్డింగ్‌కు ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో రాత్రి 10 గంటలకు బయలుదేరాల్సిన విమానం రెండు గంటలకు పైగా ఆలస్యమై 12.30 గంటల ప్రాంతంలో బయలుదేరింది. ఈ ఘటనపై సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది.
Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం
అసౌకర్యానికి క్షమాపణలు
సాంకేతిక లోపం కారణంగా చైన్నై నుంచి దుబాయ్‌కు వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా వెళ్లినట్టు ఎమిరేట్స్ యాజమాన్యం తెలిపింది. తనిఖీల అనంతరం టేకాఫ్‌కు అనుమతించామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు తమ ఎయిర్‌లైన్స్ మొదటి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది.
Read More National News and Latest Telugu News
Also Read: Jammu and Kashmir Assembly Elections: కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
Updated Date - Sep 25 , 2024 | 05:54 PM