ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Haryana Elections: వినేశ్ ఫొగట్ హర్యానాలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా.. జాట్‌ల ఓట్లు ఎటువైపు

ABN, Publish Date - Sep 09 , 2024 | 02:15 PM

గత కొంతకాలంగా కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది కీలకంగా మారింది. రెజ్లర్ల ఆందోళనలో కీలక పాత్ర పోషించిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరింది. ఆమె ఈ ఎన్నికల్లో జులనా శాసనసభ స్థానం నుంచి..

Vinesh Phogat

హర్యానా శాసనసభ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశ రాజధానికి సమీపంలో ఉన్న హర్యానాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని రెండు పార్టీలు డిసైడ్ అయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కులాల ప్రభావం ఎక్కువుగా ఉండే హర్యానాలో ఈసారి ఏ వర్గం ఏ పార్టీవైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తుందనేది కీలకంగా మారింది. రెజ్లర్ల ఆందోళనలో కీలక పాత్ర పోషించిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరింది. ఆమె ఈ ఎన్నికల్లో జులనా శాసనసభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీని హర్యానాలో అధికారంలోకి తీసుకువస్తుందా.. జాట్ల ఓట్లను ఐక్యం చేస్తుందా అనే చర్చ ప్రస్తుతం హర్యానా రాజకీయాల్లో నడుస్తోంది. జాట్ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో పాటు.. రైతు ఉద్యమాలకు ఆమె మద్దతు ఇవ్వడం, పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరి, అధిక బరువు కారణంగా పతకాన్ని కోల్పవడం వంటి సంఘటన ద్వారా యువతలో ఆమెపై ఆదరణ పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా మహిళలు, రైతులు, యువతలో ఆమెకు ఉన్న ఆదరణ కారణంగా కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు పెరిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


జాట్‌ల ప్రభావం..

హర్యానా జనాభాలో జాట్‌లు 22 నుంచి 27 శాతం వరకు ఉంటారు. 2019లో బాలాకోట్‌ వైమానిక దాడుల అనంతరం దేశవ్యాప్తంగా జాతీయవాద శక్తులు ఐక్యం కావడంతో ఆ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి హర్యానాలో పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే జాట్‌ల ఓట్ల చీలిక బీజేపీకి కలిసివచ్చింది. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీల మధ్య జాట్ ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీ లాభపడింది. గత ఐదేళ్లలో రైతులు, రెజ్లర్లు, అగ్నివీరుల నిరసనలు, కుల రాజకీయాల కారణంగా హర్యారాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. జాట్ వర్గాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం ఆ సామాజిక వర్గం నేతల్లో నెలకొంది. ఈ ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో జాట్‌లు 64 శాతం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూటమికి ఓట్లు వేయగా.. 27 శాతం మంది బీజేపీకి, ఇతర పార్టీలకు తొమ్మిది శాతం మంది ఓట్లు వేశారు. 2019తో పోలిస్తే జాట్ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కూటమికి 40 శాతం పెరగ్గా.. బీజేపీకి 23 శాతం మేరకు ఓట్లు తగ్గాయి. ఇతర పార్టీలకు 17 శాతం తగ్గడంతో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడింది. హర్యానాలో 37 నియోజకవర్గాల్లో జాట్ సామాజికవర్గం దాదపు 20 శాతానికి పైగా ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో గెలుపోటములను జాట్‌లు నిర్ణయిస్తారు.

Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల


జాట్‌లు ఏకపక్షంగా ఓట్లు వేస్తారా..

రైతులు బీజేపీకి వ్యతిరేకంగా సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేశారు. వీరిలో జాట్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన వినేశ్ ఫొగట్ కాంగ్రెస్‌లో చేరడంతో లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌వైపు జాట్ వర్గం ఓటర్లు మరింత మొగ్గు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వినేశ్ ఫొగట్ చేరిక కాంగ్రెస్‌కు కలిసొస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగట్.. హర్యానాలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారా లేదా అనేది తెలియాలంటే అక్టోబర్ 8వరకు వేచి చూడాల్సిందే.

National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 02:50 PM

Advertising
Advertising