ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National : కిర్గిజ్‌స్థాన్‌లో హింస

ABN, Publish Date - May 19 , 2024 | 05:53 AM

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్‌లోని భారత ఎంబసీ సూచించింది.

  • పార్ట్‌టైం ఉద్యోగాల అంశంలో వివాదం

  • పాక్‌, బంగ్లా తప్పునకు మూల్యం చెల్లిస్తున్న భారతీయులు.. అప్రమత్తం చేసిన కేంద్రం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో అల్లర్లు చెలరేగాయి. దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులే లక్ష్యంగా స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో భారతీయ విద్యార్థులు తీవ్రభయాందోళనతో గడుపుతున్నారు. అల్లర్ల నేపథ్యంలో ఇల్లు వదిలి బయటకు రావొద్దని భారత విద్యార్థులను కిర్గిస్థాన్‌లోని భారత ఎంబసీ సూచించింది.

బిష్కెక్‌లోని పలు వైద్య కళాశాలల్లో దక్షిణాసియాకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారత్‌ సహా ఇతర దక్షిణాసియా దేశాల విద్యార్థులు తరచూ వెళ్లే ఓ రెస్టారెంట్‌ వద్ద మూడ్రోజుల క్రితం ఘర్షణ జరిగింది. విదేశీ విద్యార్థులు, కిర్గిస్థాన్‌ యువకులకు మధ్య జరిగిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కొందరు పాక్‌ విద్యార్థులు కిర్గిస్థాన్‌ యువకులపై దాడి చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో స్థానికులు శుక్రవారం అర్ధరాత్రి విదేశీయులు ఉండే హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. ఈ దాడులకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఉన్న కొన్ని వీడియోలు భయానకంగా ఉండటంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉందని కిర్గిస్థాన్‌లోని ఆదం విశ్వవిద్యాలయ భారతీయ ప్రతినిధి ఆశోక్‌ వెల్లడించారు. కాగా, ఈ ఘర్షణల్లో కొందరు పాక్‌ పౌరులు మరణించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కిర్గిస్థాన్‌ ప్రభుత్వం ఖండించింది. ఒక్క విదేశీయుడు మరణించలేదని శనివారం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి సమాచారంలేకుండా ఘర్షణలగురించి ఎలాంటి ప్రకటనలు చేయవద్దని విదేశీ ఎంబసీలను కోరింది.


విదేశీ విద్యార్థులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ జరుగుతున్న నిరసన ప్రదర్శనలను సమర్ధించింది. అల్లర్లకు పాల్పడిన పలువురు విదేశీ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు బిష్కేక్‌ నగర పోలీసు కమిషనర్‌ అజామత్‌ టోక్నోల్వీను ఉటంకిస్తూ స్థానిక మీడియా కథనం వెల్లడించింది. కాగా దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్‌ వీసాపై కిర్గిస్థాన్‌కు వెళ్లి చదువుకుంటూ మరోపక్క డెలివరీ బాయ్‌లుగా పని చేస్తున్నారు. విదేశీయులు తక్కువ వేతనాలకు పనిచేస్తుండడంపై స్థానిక నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్న వారిలో పాక్‌, బంగ్లా పౌరులే అధికంగా ఉన్నారని కిర్గిస్థాన్‌ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ పట్టుబడి దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్న వారిలోనూ పాక్‌, బంగ్లా విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. భారత్‌తో పోలిస్తే కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుకు ఖర్చు చాలా తక్కువ. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువత అక్కడికెళ్తున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకారం కిర్గిస్థాన్‌లో 14,500 మంది భారత విద్యార్థులున్నారు.

దాడుల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరపరిస్థితుల్లో సాయానికి 0555710041 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది. బిష్కెక్‌లో అలర్లు తగ్గి ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - May 19 , 2024 | 05:53 AM

Advertising
Advertising