Vistara Airways: విమానానికి మళ్లీ బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్
ABN , Publish Date - Jun 02 , 2024 | 03:32 PM
ప్యారిస్ నుంచి ముంబై బయలుదేరిన విస్తారా ఎయిర్‌వేస్ విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. విమానంలోని ప్రయాణికులను దింపివేసి.. విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ముంబై, జూన్ 02: ప్యారిస్ నుంచి ముంబై బయలుదేరిన విస్తారా ఎయిర్‌వేస్ విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. విమానంలోని ప్రయాణికులను దింపివేసి.. విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే విమానంలో బాంబు ఆనవాళ్లు లేక పోవడంతో విమానయాన సిబ్బందితోపాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Amaravati Farmers: సీఎం జగన్ పాపం పండనుంది
302 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్యారిస్ నుంచి ముంబైకి విమానం బయలుదేరింది. కొన్ని గంటల అనంతరం విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానంలోని సిబ్బంది అప్రమత్తమైంది. ఆ క్రమంలో ముంబై ఎయిర్ పోర్ట్ అధికారులను సంప్రదించింది. ఆ కొద్ది సేపటికి ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని దించేశారు. ఈ ఘటనపై విస్తారా ఎయిర్‌వేస్ స్పందించింది. ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది రక్షణ, భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఈ సందర్బంగా ప్రకటించింది.
Also Read: తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..
మరోవైపు శనివారం అంటే.. జూన్ 1వ తేదీన చెన్నై నుంచి ముంబై బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దించి వేశారు. అనంతరం ఇది నకిలీ బాంబు బెదిరింపు అని భద్రత సిబ్బంది నిర్దారించారు. ఇక మే 28వ తేదీన ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దింపి వేసి భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఇది నకిలీ బాంబు బెదిరింపు అని ఇండిగో సంస్థ స్పష్టం చేసిన విషయం విధితమే.
ఇంకోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగపూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం.. అనంతరం భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత అవి కూడా నకిలీ బాంబు బెదిరింపులని అధికారులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
For Latest News and National News click here..