ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Voter ID Download: ఫోన్‌లో ఓటర్ ఐడీ.. ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి

ABN, Publish Date - May 10 , 2024 | 12:55 PM

ఓటు వేసేందుకే కాదు, ఐడీ ప్రూఫుల్లో ఒకటిగానూ ఓటర్‌ ఐడీ ఉపయోగపడుతుంది. అయితే దాన్ని అన్ని వేళలా జేబులో పెట్టుకుని తిరగడం సాధ్యం కాదు. అందుకే భారత ఎన్నికల సంఘం - డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు దిశగా కృషి చేసింది. 2021లో నేషనల్‌ ఓటర్స్‌ రోజున డిజిటల్‌ ఓటర్‌ ఐడీ(Voter Id)లను అందించింది. అయితే ఇప్పుడు ఎడిట్‌ చేయడానికి వీలు లేని పీడీఎఫ్‌ ఫార్మేట్‌లో స్మార్ట్‌ఫోన్‌ లేదంటే కంప్యూటర్‌ నుంచి డౌన్‌‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమరం జరుగుతోంది. మే 13న అటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేయడానికి నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే ఓటర్ ఐడీ లేనిదే ఓటు వేయడం కుదరనిపని. మీ ఫోన్లోనే క్షణాల్లో ఓటర్ ఐడీని డౌన్ లోడ్ చేసుకుని పోలింగ్ కేంద్రం దగ్గర చూపిస్తే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.


ఓటు వేసేందుకే కాదు, ఐడీ ప్రూఫుల్లో ఒకటిగానూ ఓటర్‌ ఐడీ ఉపయోగపడుతుంది. అయితే దాన్ని అన్ని వేళలా జేబులో పెట్టుకుని తిరగడం సాధ్యం కాదు. అందుకే భారత ఎన్నికల సంఘం - డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు దిశగా కృషి చేసింది.

2021లో నేషనల్‌ ఓటర్స్‌ రోజున డిజిటల్‌ ఓటర్‌ ఐడీ(Voter Id)లను అందించింది. అయితే ఇప్పుడు ఎడిట్‌ చేయడానికి వీలు లేని పీడీఎఫ్‌ ఫార్మేట్‌లో స్మార్ట్‌ఫోన్‌ లేదంటే కంప్యూటర్‌ నుంచి డౌన్‌‌లోడ్‌ చేసుకోవచ్చు.


దీని కోసం మొదట ఓటర్‌ ఐడీ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌తో లింక్‌ కావాలి. అలాగే డౌన్‌లోడింగ్‌ ప్రక్రియకు ముందే కైవైసీ పూర్తి చేయాలి. ఫిజికల్‌ ఐడీ కార్డును కూడా పక్కనే పెట్టుకోవాలి.

  • స్మార్ట్‌ఫోన్‌లో వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి.

  • అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాలి.

  • డౌన్‌లోడ్‌ ఈ-ఎపిక్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి.

  • వెబ్‌పేజీ టాప్‌లో ఉండే ఈ-ఎపిక్‌(E - EPIC) డౌన్‌లోడ్‌ బటన్‌ను హిట్‌ చేయాలి.

  • ఇప్పటికే యూజర్‌ అయితే లాగిన్‌ వివరాలను ఎంటర్‌ చేయాలి. లేకుంటే ఫోన్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి.

  • పోర్టల్‌లోకి వెళ్ళగానే డౌన్‌లోడ్‌ ఈ-ఎపిక్‌ లింక్‌ని టాప్‌ చేయాలి. అక్కడ ఎపిక్‌ నంబర్‌ని ఎంటర్‌ చేయాలి. ఫిజికల్‌ ఓటర్‌ ఐడీపై పది డిజిట్స్‌తో ఆ నంబర్‌ ఉంటుంది.

  • మొబైల్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే వివరాలను నిర్ధారించుకోవాలి.

  • ఓటీపీని ఉపయోగించి డౌన్‌లోడ్‌ ఈ-ఎపిక్‌ను హిట్‌ చేయాలి. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి డిజిటల్‌ ఓటర్‌ ఐడీ డౌన్‌లోడ్‌ అవుతుంది.

Prajval Revanna Scandal Case: రేవణ్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తనను బెదిరించి ఆరోపణలు చేయించారన్న మహిళ

Covishield Side Effects: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వైద్యుల తీవ్ర ఆందోళన.. తయారీని ఆపేసినట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనిక

Read Latest News and National News Click Here..

Updated Date - May 10 , 2024 | 12:56 PM

Advertising
Advertising