Jharkhand: భూములను ఆక్రమిస్తున్న వక్ఫ్ బోర్డుకు ముకుతాడు: అమిత్‌షా
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:59 PM
వక్ఫ్ బోర్డులో మార్పులను తాము వ్యతిరేకిస్తున్నట్టు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే వాళ్లు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదిస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అమిత్‌షా స్పష్టం చేశారు.
రాంచీ: కనిపించిన ప్రతి భూమి, ఆస్తి తమదేనంటూ వాటిని వక్ఫ్ బోర్డు (Waqf Board) తమ నియంత్రణలోకి తీసుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో మార్పులు తీసుకురావడానికి, సంబంధిత చట్టాన్ని సవరించడానికి సమయం వచ్చిందని చెప్పారు.
Suvendu Adhikari: సువేందు అధికారికి ఇక దేశమంతటా 'జడ్' కేటగిరి భద్రత
జార్ఖాండ్‌లోని బాఘ్‌మారాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, భూములను తమ నియంత్రణలోకి తీసుకోవడం వక్ఫ్ బోర్డుకు ఒక అలవాటుగా మారిందన్నారు. కర్ణాటకలో గ్రామస్థుల ఆస్తులను వక్ఫ్ బోర్డు కబళిస్తోందని, వారి భూములతో పాటు ఆలయ భూములు, రైతుల భూములను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటోందని అన్నారు. ''ఇప్పుడు చెప్పండి...వక్ఫ్ బోర్డులో మార్పులు చేయాలా? వద్దా?'' అని సభికులను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.
హేమంత్, రాహుల్ ఏం చేసినా సరే...
వక్ఫ్ బోర్డులో మార్పులను తాము వ్యతిరేకిస్తున్నట్టు జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని, అయితే వాళ్లు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదిస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అమిత్‌షా స్పష్టం చేశారు. అదేవిధంగా జార్ఖాండ్‌లో చొరబాటుదారులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని కచ్చితంగా అమలు చేస్తా్మని అన్నారు. అయితే గిరిజనలను మాత్రం ఆ పరిధిలోకి తేమని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో జార్ఖాండ్‌ను అత్యంత సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, జేఎంపీ-కాంగ్రెస్ లూటీ చేసిన సొమ్మును వెనక్కి రప్పిస్తామని, ఖనిజ ఆధారిత పరిశ్రమలు జార్ఖాండ్‌లో ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చేస్తామని, జార్ఖాండ్‌లోని అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. జార్ఖాండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 23న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు
Bangalore: ఓ మై డాగ్.. క్లూస్ టీం డాగ్ సిరి మృతితో పోలీసుల ఆవేదన
For National news And Telugu News
Updated Date - Nov 12 , 2024 | 04:59 PM