Washington : 720 కోట్ల విరాళాలు వెనక్కి!
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:15 AM
అమెరికా అఽధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జో బైడెన్ తన మద్దతుదారుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. సుమారు రూ.720 కోట్ల(90 మిలియన్ డాలర్లు) మేరకు ఎన్నికల విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చిన దాతలు తాజాగా వెనక్కి తగ్గారు.
ఎన్నికల వేళ బైడెన్‌కు భారీ దెబ్బ
మద్దతుదారుల విశ్వసనీయత కోల్పోతున్న అమెరికా అధ్యక్షుడు
జో వ్యతిరేకుల వెనుక ఒబామా?
వాషింగ్టన్, జూలై 13: అమెరికా అఽధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ జో బైడెన్ తన మద్దతుదారుల విశ్వసనీయతను కోల్పోతున్నారు. సుమారు రూ.720 కోట్ల(90 మిలియన్ డాలర్లు) మేరకు ఎన్నికల విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చిన దాతలు తాజాగా వెనక్కి తగ్గారు. ఎన్నికల వేళ ఈ పరిణామం బైడెన్‌కు భారీ దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు. బైడెన్‌కు బలమైన మద్దతుదారుగా ఉన్న ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ సైతం వెనక్కి తగ్గినట్టు చెప్పారు.
250 మిలియన్ డాలర్ల ప్రకటన ఖర్చును భరించేందుకు సిద్ధమని ఈ సంస్థ సభ్యులు గతంలో వెల్లడించారు. కానీ, ఇప్పుడు వీరు కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు.. సొంతపార్టీ డెమొక్రాటిక్ ఎంపీల్లో 18 మంది సైతం బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
నవంబరు 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ఆయన తప్పుకోవాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. ఇలాంటి సమయంలో నిధుల రాకకూడా ఆగిపోవడంతో బైడెన్‌పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ ఆయన మాత్రం ట్రంప్‌ను ఓడించి తీరుతానని ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఒబామా నుంచీ ఒత్తిడి?
ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి జో బైడెన్‌ను తప్పుకోవాలంటూ మాజీ అధ్యక్షుడు ఒబామా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని కోరుతున్న వారి వెనుక ఒబామా ఉన్నారని బైడెన్ ప్రచార బృందం కూడా సందేహిస్తోంది. సీఎన్‌ఎన్ మీడియా కథనం ప్రకారం ఒబామాతోపాటు మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ సైతం బైడెన్ తీరుపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
Updated Date - Jul 14 , 2024 | 03:15 AM