ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Washinton : ప్రపంచాన్ని కుదిపేసిన కెనడీ హత్య

ABN, Publish Date - Jul 15 , 2024 | 02:59 AM

అమెరికా 35వ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ 1963 నవంబరు 22న హత్యకు గురైన ఘటన నాడు అమెరికాతోపాటు యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. అధ్యక్ష పదవిలో ఉండగానే..

వాషింగ్టన్‌, జూలై 14: అమెరికా 35వ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ 1963 నవంబరు 22న హత్యకు గురైన ఘటన నాడు అమెరికాతోపాటు యావత్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. అధ్యక్ష పదవిలో ఉండగానే.. వరుసగా రెండోసారి డెమోక్రటిక్‌ అభ్యర్థిగా నిలిచిన ఆయనను ఎన్నికల ప్రచారంలోనే దుండగుడు కాల్చి చంపాడు. 1964 అధ్యక్ష ఎన్నికల కోసం ఆ రోజు టెక్సాస్‌ రాష్ట్రంలోని డల్లా్‌సలో ఆయన ఓపెన్‌ టాప్‌ లైమోసెన్‌ కారులో కూర్చొని ప్రచారం నిర్వహించారు.

భారీ వాహన శ్రేణితో నగర వీధుల గుండా వస్తుంటే, ఆయనను చూసేందుకు దారిపొడవునా జనం భారీగా నిల్చున్నారు. ఆయన పక్కనే భార్య జాక్వలైన్‌ కెనడీ కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్వాయ్‌ డీలే ప్లాజా వద్దకు చేరుకోగానే దుండగుడు కాల్పులు జరపగా.. కెనడీ వీపుపై ఒక తూటా, తలలో ఒక తూటా దిగబడ్డాయి.

సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్స్‌ వెంటనే కెనడీని పార్క్‌లాండ్‌ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించగా, మధ్యాహ్నం ఒంటిగంటకే ఆయన మరణించినట్టు ప్రకటించారు. అమెరికా నౌకాదళ మాజీ ఉద్యోగి ఓస్వాల్డ్‌(24)ను హంతకుడిగా గుర్తించారు. ఓస్వాల్డ్‌ను అరెస్టు చేసిన రెండు రోజులకే అతన్ని మరోవ్యక్తి కాల్చి చంపాడు. దీంతో, కెనడీ హత్య వెనుక కుట్ర ఉందని, అది బయటపడకుండా ఉండేందుకే ఓస్వాల్డ్‌ను హత్య చేశారని ప్రచారం జరిగింది.

Updated Date - Jul 15 , 2024 | 02:59 AM

Advertising
Advertising
<