Air Pollution: తగ్గిన వాయు కాలుష్యం తీవ్రత.. నగర వాసులకు కాస్తా ఉపశమనం..

ABN, Publish Date - Nov 21 , 2024 | 08:05 AM

ఢిల్లీతోపాటు దాని పరిధిలోని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. బుధవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీ కింద నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు స్వల్పంగా మెరుగుపడింది. అయితే ఏ మేరకు తగ్గింది, ఎంత స్థాయిలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Air Pollution: తగ్గిన వాయు కాలుష్యం తీవ్రత.. నగర వాసులకు కాస్తా ఉపశమనం..
delhi AQI today

దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో ఆదివారం నాటికి గాలి ప్రమాదకర స్థాయి AQI 500 దాటేసింది. ఆ తర్వాత క్రమంగా కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టింది. బుధవారం నగరంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనిపించింది. బుధవారం సాయంత్రం 4 గంటల నాటికి ఢిల్లీ ఏక్యూఐ 419గా నమోదైంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం గురువారం ఉదయం 5 గంటలకు AQI ప్రమాదకర కేటగిరీ నుంచి 384కి పడిపోయింది.

దేశంలోని 70కి పైగా నగరాలు ప్రస్తుతం తీవ్ర విభాగం నుంచి తగ్గాయని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య పరిస్థితి మెరుగుపడిందని పలువురు అంటున్నారు.


లక్నోలో కాలుష్యం

ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో గ్రేడ్ 4 ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కానీ కాలుష్యం హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి ఇప్పటికీ ప్రమాదకరమైన కేటగిరీలోనే ఉంది. ఉదయం 6 గంటలకు CPCB తాజా సమాచారం ప్రకారం AQI 406గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉదయం 5 గంటల నివేదికలో AQI 280గా రికార్డైంది. బుధవారంతో పోలిస్తే ఏక్యూఐలో 10 పాయింట్ల తగ్గుదల వచ్చింది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


నోయిడా-ఘజియాబాద్‌లో కాలుష్యం

దీంతోపాటు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్‌సీఆర్‌లోని నోయిడా, ఘజియాబాద్ నగరాల గాలి చాలా పేలవమైన కేటగిరీలో ఉంది. CPCB నివేదిక ప్రకారం ఘజియాబాద్ AQI 328 స్థాయిలో ఉంది. నోయిడా AQI 304గా రికార్డైంది. అనేక చర్యల కారణంగా వాయు కాలుష్యం తగ్గిందని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే శుక్రవారం, శనివారాల్లో గాలి కాలుష్య స్థాయిలలో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.


గ్రేడ్ 4 పరిమితులు ఎంతకాలం అమల్లో ఉంటాయి?

నవంబర్ 18 నుంచి రాజధానిలో ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 10వ తరగతి, 12వ తరగతి పాఠశాలలు మూతపడగా, ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మందికి ఇంటి నుంచి పని సౌకర్యం కల్పించారు. ఎలక్ట్రిక్, డీజిల్ వాహనాలు కాకుండా, అనేక వాణిజ్య, ఇతర వాహనాల రాకపోకలను నిషేధించారు. పరిస్థితి గణనీయంగా మెరుగుపడే వరకు గ్రేడ్ 4 పరిమితులు అమల్లో ఉంటాయి. గాలి కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాస్కులు లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా మారింది.


ఇవి కూడా చదవండి:

CBSE: 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదల.. ఎప్పటి నుంచంటే..


PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 21 , 2024 | 08:06 AM