LokSabha Elections: మళ్లీ మేమే వస్తాం
ABN, Publish Date - May 23 , 2024 | 01:39 PM
ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశప్రజలకు తెలుసునని చెప్పారు.
న్యూఢిల్లీ, మే 23: ముచ్చటగా మూడోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశప్రజలకు తెలుసునని చెప్పారు.
గురువారం న్యూడిల్లీలో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాలకు భారీగా మహిళలు, యువత బారులు తీరి.. మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దీంతో వారి ఉద్దేశ్యమేమిటో అర్థమవుతుందని పేర్కొన్నారు.
దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని క్షేత్రస్థాయిలో ప్రజలు సైతం ఆకాంక్షిస్తున్నారన్నారు. అయితే ప్రధాని మోదీ తీసుకు వచ్చిన పథకాల ద్వారా మహిళలు లబ్ది పొందారని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వివరించారు.
అయితే క్రోని కేపిటలిజం గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి తనదైన శైలిలో స్పందించారు. గతంలో జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించాలన్నారు. ఈ క్రోని కేపిటలిజం అనేది గత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో ఉందని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. చేతిలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుంటారని వ్యంగ్యంగా అన్నారు. 2014-15 మధ్య రాహుల్ గాంధీ ఏం చేశారో అందరికీ తెలుసునన్నారు. ఆ క్రమంలో ఆయన సుప్రీంకోర్టుకు క్షమాపణలు సైతం చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.
మినరల్ యాక్ట్ 2015 అనుసరించి.. షెడ్యుల్ తెగల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టామని ఆమె వివరించారు. అయితే ఈ విధమైన చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
For More Latest National News and Telugu News..
Updated Date - May 23 , 2024 | 01:40 PM