ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ ఆ పార్టీలో చేరనున్నారా? వారి భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

ABN, Publish Date - Mar 07 , 2024 | 03:20 PM

Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్‌కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు.

Sourav Ganguly

Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్‌కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు. లోక్‌సభ ఎన్నికల ముందు వీరిద్దరి భేటీ.. ఎంతో ప్రాధాన్యత నెలకొంది. గంగూలీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరుతారా? అనే చర్చ జరుగుతోంది. అయితే, గంగూలీ మాత్రం అలాంటి సంకేతాలేవీ ఇవ్వడం లేదని టీఎంసీ శ్రేణులు చెబుతున్నారు.

గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్పెయిన్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సీఎం మమతా బెనర్జీతో కలిసి సౌరవ్ గంగూలీ కూడా వెళ్లారు. అప్పుడు కూడా ఆయన టీఎంసీలో జాయిన్ అవుతారనే ప్రచారం జరిగింది. కానీ, గంగూలీ ఆ ప్రచారాన్ని కొట్టిపడేశారు. తాను వ్యక్తిగతంగా వచ్చానని, తానేమీ ఎమ్మెల్యే, ఎంపీని కూడా కాదని అన్నారు. రాజకీయ సంబంధాలు కూడా లేవని తేల్చి చెప్పారు గంగూలీ. అంతకుముందు 2022లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గంగూలీ ఇంటికి వెళ్లి కలవగా ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని కూడా గంగూలీ ఖండించారు. మొత్తానికి గంగూలీ రాజకీయ ప్రవేశంపై ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. మరి గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి..

10 ఏళ్లు గొర్రెలు అయ్యాం.. ఇక సింహాల్లా పోరాడాల్సిందే..

పవన్ కల్యాణ్ పోటీ చేసేది ఎక్కడ అంటే..? ఆ రెండు చోట్లేనా..!!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 03:20 PM

Advertising
Advertising