ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Bengal: మమత సర్కార్ అత్యాచార వ్యతిరేక బిల్లు పేరు 'అపరాజిత'... 3న అసెంబ్లీ ముందుకు

ABN, Publish Date - Sep 02 , 2024 | 04:31 PM

అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదించనుంది. ఇందుకోసం సోమవారంనాడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతిపాదిత బిల్లుకు ''అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండమెంట్) బిల్లు 2024''గా పేరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కోల్‌కతా: అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వం ఆమోదించనుంది. ఇందుకోసం సోమవారంనాడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతిపాదిత బిల్లుకు ''అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండమెంట్) బిల్లు 2024''గా పేరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రెయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర సంచలనమైన నేపథ్యంలో కఠినమైన అత్యాచార వ్యతిరేక బిల్లును పదిరోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్టు మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.


కాగా, అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణశిక్ష పడేలా ఈ బిల్లు ప్రతిపాదించనుంది. బిల్లుపై ఎన్ని గంటల సేపు చర్చ జరపాలనే దానిపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సోమవారం సమావేశపై ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపే అవకాశాలున్నట్టు తెలిసింది. ఈనెల 3వ తేదీన అసెంబ్లీలో ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ తెలిపారు.

Deli Waqf Board case: 'ఆప్' ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన ఈడీ


కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి కోల్‌కతా పోలీస్ సివిక్ వాలంటీర్‌ను అరెస్టు చేశారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 02 , 2024 | 04:31 PM

Advertising
Advertising