West Bengal: టీఎంసీ కీలక నిర్ణయం... పార్టీ పదవి నుంచి కునల్ ఘోష్‌కు ఉద్వాసన
ABN, Publish Date - May 01 , 2024 | 05:40 PM
పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునల్ ఘోష్‌ను తొలగించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా ఘోష్ అభిప్రాయాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కునల్ ఘోష్ (Kunal Ghosh)ను తొలగించింది. పార్టీ వైఖరికి అనుగుణంగా ఘోష్ అభిప్రాయాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీఎంసీ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీనిపై పార్టీ సీనియర్ నేత డెరిక్ ఒబ్రెయిన్ సంతకం చేశారు.
Lok Sabha Elections 2024: ఓటర్ టర్న్ అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై మమత డౌట్..
"కునల్ ఘోష్ ఇటీవల వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీ వైఖరికి భిన్నంగా ఉన్నాయి. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఎంతమాత్రం పార్టీ అభిప్రాయాలు కావు. ఏఐసీటీ ప్రధాన కార్యాలయం జారీ చేసిన ప్రకటనలను మాత్రమే అధికారిక ప్రకటనలుగా పరిగణనలోకి తీసుకోవాలి. ఘోష్‌ను ఇంతకుముందు పార్టీ ప్రతినిధి పదవి నుంచి రిలీవ్ చేశాం. ఇప్పడు, ఆయనను పార్టీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలిగించాం. ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలకు మీడియా పరిగణనలోకి తీసుకోవద్దు. అలా తీసుకుంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది'' అని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
Read Latest National News and Telugu News
Updated Date - May 01 , 2024 | 05:41 PM