ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Assembly Elections: మహారాష్ట్ర ఎన్నికలు ఎప్పుడని అడిగితే ఈసీ ఏమన్నారంటే?

ABN, Publish Date - Sep 28 , 2024 | 05:37 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారంనాడు సమీక్షించారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్.ఎస్.సంధు తదితరులు పాల్గొన్నారు.

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) శనివారంనాడిక్కడ సమీక్షించారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్.ఎస్.సంధు, జిల్లా ఎలక్టోరల్ అధికారులు (DEOs), ఎస్‌పీ, మున్సిపల్ కమిషనర్లు, డివిజనర్ కమిషనర్లు, పలువురు ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఎన్నికల నేరాలపై (Electoral offences) విచారణను వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీస్ అధికారులను ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అదేశించారు.

Jammu and Kashmir Elections: తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కార్ తథ్యం: మోదీ


అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలపై అడిగిన ప్రశ్నలకు రాజీవ్ కుమార్ సమాధానమిస్తూ, మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో 25 ఎస్‌సీ, 29 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీతో ముగుస్తుందని, అందువల్ల ఆ తేదీకి ముందే ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 9.59 కోట్ల అర్హులైన ఓటర్లు ఉన్నారని, వారిలో 4.59 కోట్ల మంది పురుషులు, 4.64 కోట్ల మంది స్త్రీలు ఉన్నట్టు చెప్పారు. 18-19 ఏళ్లు కలిగి తొలిసారి ఓటింగ్ హక్కు పొందిన వారి సంఖ్య ప్రోత్సహకరంగా ఉందని, వీరు సుమారు 19.48 లక్షల వరకూ ఉంటారని చెప్పారు. నవంబర్ 26వ తేదీతో అసెంబ్లీ గడువు ముగియనుందని ఈసీ వివరించిన నేపథ్యంలో అక్టోబర్‌లో ఎన్నికలు ఉంటాయని, రెండు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


For National News And Telugu News..

Also Read: Hardeep Singh Puri: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా? కేంద్రమంత్రి కీలక ప్రకటన

Updated Date - Sep 28 , 2024 | 05:37 PM