Relationship: గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందో చూస్తే..
ABN, Publish Date - Jun 11 , 2024 | 09:56 AM
Uttar Pradesh: అతను.. ఆమె.. హ్యాపీగా రెస్టారెంట్‌కు వచ్చి భోజనం చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎదురుగా నిల్చున్నారు. వీరిని చూసి వారిద్దనూ బిత్తరపోయారు. అప్పటి వరకూ సంతోషంతో వెలిగిపోయిన వారి ముఖాలు..
Uttar Pradesh: అతను.. ఆమె.. హ్యాపీగా రెస్టారెంట్‌కు వచ్చి భోజనం చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎదురుగా నిల్చున్నారు. వీరిని చూసి వారిద్దనూ బిత్తరపోయారు. అప్పటి వరకూ సంతోషంతో వెలిగిపోయిన వారి ముఖాలు.. వారిని చూడగానే మొత్తం మాడిపోయినట్లు అయ్యింది. ఎందుకంటే.. అక్కడికి వచ్చింది ఆయన గారి భార్య, బామ్మర్ది. ఇంకేముంది నెక్ట్స్ సీన్.. సినిమా లెవల్లో మారిపోయింది. ఇద్దరినీ లాగిపట్టి బజార్లోకి ఈడ్చుకొచ్చారు. నానా హంగామా చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా కాసేపు రచ్చ రచ్చ అయ్యింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
లక్నోలో బీడీడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైజాబాద్ రోడ్డులో గల ఓ రెస్టారెంట్ వద్ద అర్థరాత్రి భార్యాభర్తల మధ్య హైవోల్టేజీ డ్రామా నడిచింది. బారాబంకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వచ్చాడు. అది తెలుసుకున్న అతని భార్య.. తన సోదరుడితో కలిసి రెస్టారెంట్‌కు వచ్చింది. తన భర్తను వేరే మహిళతో కలిసి ఉండటం చూసిన భార్య.. ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తను, అతని ప్రియురాలిని రెస్టారెంట్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. ఇద్దరినీ రోడ్డుపైనే పొట్టు పొట్టుగా కొట్టారు. ఈ వ్యవహారం దాదాపు కొన్ని గంటల పాటు కొనసాగింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలికి వచ్చారు.
ఇరు వర్గాలను శాంతింపజేశారు పోలీసులు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘర్షణకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
For More National News and Telugu News..
Updated Date - Jun 11 , 2024 | 09:56 AM