ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: అలాచేస్తే... ఇంటింటికి రూ.75,000

ABN, Publish Date - Nov 13 , 2024 | 07:07 PM

కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం చాలాకాలంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాయని, అయినప్పటికీ సంథాల్ పరగణకు వారు ఇచ్చినది కేవలం వలసలు, పేదరికం, నిరుద్యోగమేనని ప్రధాని మోదీ విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారని అన్నారు.

రాంచీ: సోలార్ ప్యానల్స్ (Solar Panels) ఏర్పాటు చేసుకునే ప్రతి ఇంటికి కేంద్రం రూ.75,000 నుంచి రూ.80,000 ఇస్తుందని ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సోలార్ ప్యానెల్స్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌కు ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండదని (Zero elcctricity bill) చెప్పారు. ఇంటి అవసరాలకు మించి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలుచేస్తుందని జార్ఖాండ్‌ (Jharkhand) లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ తెలిపారు.

West Bengal bypolls 2024: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తత, హింసాత్మక ఘటనలు


పాలకులు మీకేమిచ్చారు?

కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎం చాలాకాలంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాయని, అయినప్పటికీ సంథాల్ పరగణకు వారు ఇచ్చినది కేవలం వలసలు, పేదరికం, నిరుద్యోగమేనని ప్రధాని విమర్శించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, కానీ ప్రజలు మాత్రం పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు సంబంధించి అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలతో ఉందని ఆయన విమర్శించారు. ఆయా వర్గాల హక్కులను బలహీనపరచేందుకు, చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఐక్యంగా నిలవాలని కోరారు. ఒకటిగా ఉంటేనే మీరంతా సురక్షితంగా ఉంటారని, దీనిపై అప్రమత్తం చేసేందుకే తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు.


జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ బుధవారంనాడు జరిగింది. 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగగా, రెండవ విడతగా 38 నియోజకవర్గాల్లో నవంబర్ 23న పోలింగ్ జరుగుతుంది. దీంతో పోలింగ్ ముగుస్తుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి

Nitish Touch PM Feet: మళ్లీ మోదీ పాదాలకు మొక్కిన నితీష్

నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు

ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!

For More National And Telugu News

Updated Date - Nov 13 , 2024 | 07:09 PM