West Bengal: బెంగాల్‌ని విభజించేంత దమ్ముందా.. బీజేపీకీ దీదీ స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - Jul 29 , 2024 | 08:21 PM
పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి.. ఎలా అడ్డుకోవాలో తనకు బాగా తెలుసని దీదీ పేర్కొన్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి.. ఎలా అడ్డుకోవాలో తనకు బాగా తెలుసని దీదీ పేర్కొన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న మమతా... బెంగాల్‌లోని రెండు జిల్లాలను, బిహార్, జార్ఖండ్‌లోని మరికొన్ని జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, ఈశాన్యంలోని ఓ భాగాన్ని ఉత్తరబెంగాల్‌గా ఏర్పాటు చేయాలని జార్ఖండ్‌కు చెందిన బీజేపీ లోక్‌సభ సభ్యుడు నిషికాంత్ దూబే చేసిన డిమాండ్‌ను ముఖ్యమంత్రి మమత ఖండించారు.
బెంగాల్‌ను విడదీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. ముర్షిదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ శాసనసభ్యుడు గౌరీ శంకర్ ఘోష్ కూడా నిషికాంత్ దూబే డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో భారత్-బంగ్లాదేశ్ రివర్ కమిషన్‌కు అనుగుణంగా భారత్-భూటాన్ రివర్ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను ఆమె లేవనెత్తారు.
ఎక్కువ సీట్లిచ్చినా అన్యాయమే..
"ప్రధాని సమక్షంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను లేవనెత్తాను. బెంగాల్ రాష్ట్రం ఆకారం పడవలా ఉన్నందున, రాష్ట్రంలో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంటోంది. బంగ్లాదేశ్‌తో తీస్తా నీటిని పంచుకునే విషయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిని మేం అంగీకరించం.
వరద విపత్తుల నిర్వహణకు కేంద్రం పక్క రాష్ట్రాలకు నిధులు అందజేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఏటా ఈ నిధులను కోల్పోతోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బెంగాల్‌లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. బెంగాల్‌ను విభజించేందుకు ఎవరొస్తారో రానివ్వండి. దాన్ని ఎలా అడ్డుకోవాలో వారికి చూపుతాం" ఆమె దీదీ పేర్కొంది.
రాష్ట్రంలో భూమికోత నియంత్రణ, వరద నివారణ చర్యలపై తీర్మానం చేసిన సందర్భంగా ఈ విషయాన్ని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు.
Updated Date - Jul 29 , 2024 | 08:21 PM