Wines: ఒకే రోజు రూ.400 కోట్ల మద్యం విక్రయాలు.. ఇళ్లల్లో స్టాక్ పెట్టుకున్న మందుబాబులు..
ABN, Publish Date - Apr 18 , 2024 | 01:34 PM
రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ దుకాణాల్లో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒకే రోజు రాష్ట్రమంతటా రూ.400 కోట్ల మేర మద్యం విక్రయించినట్లు టాస్మాక్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
- ఎన్నికల సెలవుల ఎఫెక్ట్ !
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా టాస్మాక్ దుకాణాల్లో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒకే రోజు రాష్ట్రమంతటా రూ.400 కోట్ల మేర మద్యం విక్రయించినట్లు టాస్మాక్ ఉన్నతాధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 19న లోక్‌సభ ఎన్నికల పోలింగ్(Lok Sabha Election Polling) నిర్వహించడం కోసం బుధవారం నుంచి శనివారం వరకు టాస్మాక్ దుకాణాలకు సెలవు ప్రకటించారు. దీంతో మద్యం ప్రియులు మంగళవారం టాస్మాక్ దుకాణాలకు పోటెత్తి మూడు రోజులకు సరిపడా మద్యం కొనుగోలు చేశారు. టాస్మాక్ నిబంధనల ప్రకారం ఓక్కో వ్యక్తికి ఓ బీరు, మూడు క్వార్టర్ బాటిల్స్ మద్యం విక్రయించాల్సి ఉంది. అయితే మంగళవారం మందుబాబులు విడతల వారీకా బీర్లు, మద్యం సీసాలు కొని ఇళ్ళకు తీసుకెళ్ళారు. కొంతమంది మద్యపాన ప్రియులు షాపుల వద్దే మద్యం తాగి, మూడు రోజులకు సరిపడా మద్యం, బీర్ కొనుగోలు చేసి ఇళ్లకు చేరారు.
ఇదికూడా చదవండి: Former Prime Minister: మాజీ ప్రధాని సంచలన కామెంట్స్.. ఆస్తి కోసం 9ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు..
సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలలో రోజూ రూ.150 కోట్ల మేరకు మద్యం విక్రయాలు జరుగుతాయి.. అయితే మంగళవారం రెండున్నర రెట్లు అమ్మకాలు పెరిగి సుమారు రూ.400 కోట్ల మేర మద్యాన్ని విక్రయించినట్లు టాస్మాక్ అధికారులు వెల్లడించారు. ఇక నగరంలోనూ, సమీప జిల్లాలైన తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోనూ మంగళవారం మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో నాలుగింతల మద్యం విక్రయాలు జరిగినట్లు టాస్మాక్ అధికారులు పేర్కొన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత శనివారం తెరచుకోనున్న టాస్మాక్ దుకాణాల్లో మళ్ళీ మద్యం అమ్మకాలు అధికమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలకు సెలవు ప్రకటించడంతో శనివారమే మందుబాబులు ఆదివారం కోసం మద్యం కొనే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.
ఇదికూడా చదవండి: Bangalore: గుర్రానికి గ్లాండర్స్ వైరస్.. 5కిలోమీటర్ల మేర రెడ్‌జోన్
Updated Date - Apr 18 , 2024 | 01:41 PM